Rtc News” తెలంగాణ ఆర్టీసీ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. పలు ప్రముఖ దేవాలయాల ప్రసాదాలను ప్రజలకు అందించింది. అలాగే ప్రస్తుతం మరో వినూత్నం కార్యక్రమాన్ని తెలంగాణ ఆర్టీసీ ప్రారంభించింది. తెలంగాణాలో వేసవి వచ్చిందంటే మామిడి పచ్చళ్లు ఎక్కువగా చేస్తుంటారు. తెలంగాణాలోని అన్ని పల్లెల్లోనూ దాదాపు మామిడి పచ్చళ్లు తెలియని వారుండరు. మామిడి పచ్చళ్లను వాడుకభాషలో మామిడి తొక్కుగా పిలుస్తుంటారు. ఇంతటి ప్రాచుర్యం ఉన్న మామిడి పచ్చళ్లు సిటీల్లో ఉండే వారు పల్లెటూర్ల నుంచి తెప్పించుకుంటారు. అయితే ఇందుకోసం ఆర్టీసీ ముందడుగు వేసింది. పల్లెటూర్లనుంచి సిటీలకు కానీ, ఒక ఊరు నుంచి మరో ఊర్లో ఉండే వారికి పచ్చళ్లను అందించే ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించింది. తెలంగాణాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 24 గంటల్లో అవకాయ పచ్చళ్లను అందించేందుకు ఆర్టీసీ సిద్దమైంది. తాజా ఆవకాయ మీ ఇంటి జార్లో ఉంటుందని ఆర్టీసీ ఎండీ ట్వీట్ చేశారు. సురక్షితంగా డెలీవరి చేయబడిన అమ్మమ్మ తయారు చేసిన గొప్ప రుచిని ఆస్వాదించండి అంటూ రాసుకొచ్చారు.
Fresh #avakaya is home in a jar.
Enjoy the rich taste of ammamma’s avakaya, delivered safely by @TSRTC_LOGISTICS.
Count on us to satisfy your cravings within 24 hours, anywhere in #Telangana. #summer #logistics #delivery@TSRTCHQ @PROTSRTC pic.twitter.com/iJcglX0liE
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) April 17, 2024
ఇవి కూడా చదవండి
Patel youth force” పటేల్ యూత్ గర్జన సభ విజయవంతం
Ys Sharmila”మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం… వైఎస్ షర్మిల