Ys Sharmila”మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం… వైఎస్ ష‌ర్మిల

Ys Sharmila

Ys Sharmila” మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజలారా.. మాకు న్యాయం చేయండి అంటూ వైఎస్ ష‌ర్మిల (Ys Sharmila) ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు. జగన్ అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాన‌ని తెలిపారు. అన్న కోసం ఇళ్ళు వాకిలి వదిలేసి తిరిగాన‌ని చెప్పుకొచ్చారు. జగన్ అన్న సీఎం అయితే వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుందనుకున్నా. జగన్ అన్న ఏది చెప్తే అది చేశాన‌ని వివ‌రించారు. వివేకా హత్య విషయంలో సునీత, చిన్నమ్మ బాగా నష్టపోయారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న అని తెలిపారు. రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలా అని సొంత రక్త సంబంధానికి న్యాయం చేయకపోతే మనం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. 5 ఏండ్లు హంతకులను కాపాడార‌ని మండిప‌డ్డారు. మళ్లీ వారికే సీటు ఇచ్చారు.హంతకుడు చట్టసభల్లోకి వెళ్లొద్దనే కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాని స్ప‌ష్టం చేశారు. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. మాకు న్యాయం చేయండ‌ని కోరారు. పులి క‌డుపున పులే పుడుతుంద‌న్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Accident At Hyderabad” హైదరాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

Lion Viral Video” సింహాల‌ను బెదిరించిన ముంగీస‌.. వీడియో వైర‌ల్

Patel Youth Force” ప‌టేల్ గ‌ర్జ‌న‌కు ముమ్మ‌ర ఏర్పాట్లు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *