Salar 2″ ఏకకాలంలో రెండు మూడు చిత్రాలతో ప్రయాణం చేయడంలో (Hero prabhs) హీరో ప్రభాస్ రాటుదేలారు. కొన్నేండ్లుగా ప్రభాస్ ప్రయాణం అదే తరహాలోనే సాగుతోంది. వర్క్ చేస్తున్న సినిమా పూర్తవ్వక ముందే, మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తూ సమాంతరంగా ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ ‘రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న ఆయన… ఒప్పుకున్న ఇంకో రెండు కొత్త సినిమాలని ఏకకాలంలో సెట్లపైకి తీసుకెళ్తున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రానున్న పీరియాడిక్ సినిమా ను జులైలో నెలలోనే మొదలు పెట్టనున్నారు. ‘సలార్ 2స షూటింగ్ కు హీరో (Hero prabhs) ప్రభాస్ పచ్చజెండా ఊపారు. వచ్చే నెల నుంచి (Hero prabhs) ప్రభాస్ లేకుండానే (Salar 2) ‘సలార్2 షూటింగ్ ప్రారంభించనున్నారు. జులై నుంచి ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనున్నట్టు తెలిసింది. అంటే ఒకే నెలలో రెండు సినిమాలు ప్రారంభమవుతాయన్నమాట. మరోవైపు ‘రాజాసాబ్‌స సినిమాను పూర్తి చేయనున్నారు. ఈ సంవత్సరంలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రాన్ని మొదలు పెడతారు. ఈ క్రమం చూస్తుంటే.. ఫ్యాన్స్ ఏండ్ల తరబడి ఎదురుచూసే అవసరం ఉండకుండానే వెంట వెంటనే తన చిత్రాలతో సందడి చేస్తారన్నమాట. జపాన్‌లో..: అగ్ర హీరో రజనీకాంత్ సినిమాలతో జపాన్‌లో మొదలైన ఆదరణ.. క్రమంగా ఇతర సినిమాలకూ దక్కుతోంది. ఆ లిస్ట్‌లో ఇప్పుడు (Salar 2) ‘సలార్’ చేరనుంది. ప్రభాస్ హీరోగా.. పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతిహాసన్ మెయిన్‌రోల్ ప్రశాంత్‌నీల్ తెరకెక్కించిన చిత్రమిది. పలు ఇండియన్ భాషల్లో విడుదలై, వల్డ్‌వైడ్‌గా రూ.700 కోట్లు రాబట్టిన ఈ చిత్రాన్ని జులై 5న జపాన్‌లో రిలీజ్ చేయనున్నట్టు ఆదివారం నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ పేర్కొంది. ‘భారతీయ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్’ జపాన్ ప్రేక్షకుల కోసం జులై 5న అక్కడిటాకీస్‌లలో విడుదలవుతోంది’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో వివరాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Fish rain” ఇరాన్‌లో చేపల వర్షం.. వీడియో వైరల్
Latest Viral Video” కూలరా..? ఏసీనా…? అసలు ఎక్కడినుంచి వస్తయి ఈ ఐడియాలు వీడియో వైరల్
Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండవేడికి పెట్రోల్ బంక్ ఓనర్ కిరాక్ ఉపాయం..వీడియో వైరల్
AaOkkatiAdakku” వినోదాత్మకంగా ఆ ఒక్కటీ అడక్కు
Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండవేడికి పెట్రోల్ బంక్ ఓనర్ కిరాక్ ఉపాయం..వీడియో వైరల్
Bulls Viral Video”బట్టల షాపును నిండాముంచిన ఎద్దుల కొట్లాట.. వీడియో వైరల్