Local news” 18.05.2025 Shankarapatnam news

Local news” ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీకి సన్నాహాలు … ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి..
శంకరపట్నం: డిసి ప్రతినిధి
మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఈ మేర‌కు శనివారం ఎమ్మెల్యే సత్యనారాయణ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి విడుతగా మండలానికో గ్రామాన్ని పైలెట్ గ్రామంగా ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వగా, ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. పైలట్ గ్రామాలుగా మానకొండూర్ మండలం లో ముంజంపల్లి, శంకరపట్నం మండలంలో ఇప్పలపల్లి, తిమ్మాపూర్ మండలంలో కొత్తపల్లి, గన్నేరువరం మండలంలో గుండ్లపల్లి, బెజ్జంకి మండలంలో వీరాపూర్,ఇల్లంతకుంట మండలంలో సిరికొండ గ్రామాలు ఎంపికైనట్టు ఆయన వివరించారు. కాగా, పైలట్ గ్రామం మినహా మిగితా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకు చర్యలు వేగవంతం చేశామని, త్వరలోనే తేదీ ఖరారు చేసి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు.

 

సిపిఐ మండల కార్యదర్శిగా రెండోసారి పిట్టల స‌మ్మ‌య్య ..
కార్మికుల, కర్షకుల పక్షాన సమ్మయ్య
అందరికీ కృతజ్ఞతలు…


శంకరపట్నం డిసీ ప్రతినిధి
భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శిగా రెండవసారి కొత్తగట్టు నివాసి, పిట్టల సమ్మయ్య నియామకమ‌య్యారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా రెండవసారి మహాసభలో పార్టీ నాయకులు కార్యకర్తలు తనపై విశ్వాసం ఉంచి కార్యదర్శిగా నియామకం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు. తన సేవలను గుర్తించి జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్, మహిళ సమైక్య జిల్లా అధ్యక్షురాలు కిన్నర మల్లవ్వ ల తో పాటు పార్టీ మండల నాయకులు తనపై నమ్మకం ఉంచి రెండోసారి శంకరపట్నం మండల సిపిఐ పార్టీ కార్యదర్శి నియామకం చేశారని పార్టీ నాయకుల కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు కార్మికులు కర్షకుల ప్రజల సమస్యలపై ముందుండి పోరాటం చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక ప్రజా ప్రతినిధులుగా సిపిఐ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని, తన నియామకనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సమ్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *