Local” 17.05.2025 Shankarpatnam news

Local”  పేద ప్రజల గొంతుక సిపిఐ పార్టీ..
జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ..


శంకరపట్నం డిసి ప్రతినిధి
పేదల గొంతుక, భారత కమ్యూనిస్టు పార్టీ అని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో సిపిఐ శంకరపట్నం మండలం 5 వ మహాసభ ను మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పార్టీ కార్యదర్శి మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ 100 సంవత్సరాల సిపిఐ పార్టీ ఆవిర్భవం నుండి పేద ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని దేశంలో రాష్ట్రాలలో పేద ప్రజల హక్కులకై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తుందని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీకి దక్కిందని, పేదవాడికి అన్యాయం జరిగిన చోట సిపిఐ పార్టీ ఉంటుందని, కార్మిక, కర్షక హక్కుల సాధనకు ముందుండి పోరాటాలు చేస్తున్న సిపిఐ పార్టీ రాబోవు స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి గ్రామాలలో సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులు నిలబెడుతుందని సిపిఐ పార్టీ అభ్యర్థుల గెలుపుకై ప్రతి కార్యకర్త సైనికుల వలె పని చేయాలని వెంకటస్వామి పిలుపునిచ్చారు. అనంతరం నూతన మండల కార్యవర్గాన్ని నియామకం చేసినట్లు పేర్కొన్నారు. మండల కార్యదర్శిగా కార్యదర్శిగా పిట్టల సమ్మయ్య, సహాయ కార్యదర్శులుగా కన్నం సదానందం, బొజ్జ సదానందం, కోశాధికారిగా బాదుల్లా , మరి కొంతమందిని కార్యవర్గ సభ్యులుగా నియామకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం…
కన్నాపూర్ లో విగ్రహాల ఊరేగింపు…
శంకరపట్నం డిసి ప్రతినిధి


ముదిరాజుల కుల దైవమైన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ వలె ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ నాయకులు మాట్లాడారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలో కన్నాపూర్ గ్రామంలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నూతనంగా నిర్మించగా ఆలయంలో నూతన విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా నూతన విగ్రహాలను ముదిరాజ్ సంఘం, కులస్తుల ఆధ్వర్యంలో కన్నాపూర్ గ్రామంలో అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం గ్రామ శాఖ నాయకులు, కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

 

యువత మత్తుకు దూరంగా ఉండాలి…
క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ లో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి..


శంకరపట్నం డిసి ప్రతినిధి
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను యువత దూరంగా ఉండాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మత్తు వదలరా మిత్రమా” అనే శీర్షికతో యువతకు మత్తు పదార్థాల దుర్వినియోగం పై అవగాహన కల్పించే ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్‌ను శుక్రవారం ఎల్ఎండి కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యనారాయణ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, మత్తుపదార్థాలను వాడకం వల్ల బంగారు భవిష్యత్తును కొందరు యువకులు నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తును తీర్చుదిద్దుకోవడం మన చేతుల్లోనే ఉంటుందని, ఇప్పటికైనా యువత మత్తు పదార్థాల జోలికి వెళ్ళకుండా సన్మార్గం ఎంచుకొని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని, తద్వారా తల్లిదండ్రుల కోరికలను సాకారం చేసిన వారవుతారన్నారు. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని, క్రీడలు దేహ దారుఢ్యానికి మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. క్రీడా స్ఫూర్తిని కలిగింపజేయడమే కాకుండా క్రమశిక్షణ, నియమశీలత వంటి మంచి లక్షణాలను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగంపై సమాజంలో అవగాహన పెంచడమే కాకుండా యువతను క్రీడల వైపు ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు పూనుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందించారు. టోర్నీ నిర్వాహకులు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం వాసు మాట్లాడుతూ మొదటి బహుమతి గా 33,333 రూపాయలు, రెండవ బహుమతి గా 22,222 రూపాయలు నగదు అందజేస్తామన్నారు. మానకొండూర్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ టోర్నమెంట్ ను ఈనెల 20న ఎల్ ఎం డి లోని జిల్లా పరిషత్ స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నీ నిర్వాహకులు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్, మానకొండూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు తొర్తి అరవింద్, ఎల్లపల్లి సిద్ధార్థ్, మానకొండూర్ మండల ఉపాధ్యక్షుడు ముక్కెర సతీష్ తదితరులు పాల్గొన్నారు.

వన్యప్రాణి లభ్యం.. అటవీ శాఖ అధికారులకు అప్పగించిన నాయకులు…


శంకరపట్నం: డిసీ ప్రతినిధి
ఓ వన్యప్రాణి తన తోటలోకి వచ్చే అలసిపోవడంతో అది చూసిన గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ రాము, శ్రీధర్ రెడ్డి వన్యప్రాణిని కాపాడి అటవీ శాఖ అధికారులకు శుక్రవారం అప్పగించారు. ఈ సందర్భంగా గుండారం గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ రాము మాట్లాడారు. సిద్దిపేట జిల్లా గుండారం గ్రామంలో గల మామిడి తోటలో ఎండకు దాహం వేసి దప్పికతో ఓ జింక మామిడి తోటలోకి వచ్చి అలసిపోవడంతో అది గమనించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రావణ్ రెడ్డి కి, టి ఏ నరేష్ కు అప్పగించినట్లు రాము తెలిపారు ఈ కార్యక్రమంలో ఎలికటి మహేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, నరేష్ గౌడ్ తిరుపతి తదితరులు ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *