Sscexamfee” తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల

Sscexamfee” హైదరాబాద్, అక్టోబర్ 23  (Telangana SSC 2025 time table and fees) 
తెలంగాణ రాష్ట్రం లోని 10వ తరగతి (SSC) ఫైనల్ పరీక్షల కోసం ఫీజు చెల్లింపు తేదీలు అధికారికంగా విడుదల అయ్యాయి. విద్యార్థులు, పాఠశాల హెడ్‌మాస్టర్లు, జిల్లా విద్యాశాఖా అధికారులు తదితరులు గమనించాల్సిన ముఖ్యమైన సూచనలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.


ఫీజు చెల్లింపు ముఖ్య తేదీలు (TS SSC exam fee details)

  • అక్టోబర్ 30 నుండి నవంబర్ 13 వరకు: విద్యార్థులు తమ స్కూల్ హెడ్‌మాస్టర్ కు ఫీజు చెల్లించాలని డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశించారు.

  • నవంబర్ 14లోపు: హెడ్మాస్టర్లు ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లింపును పూర్తి చేయాలి.

  • నవంబర్ 18లోపు: విద్యార్థుల వివరాలను (డేటా) జిల్లా విద్యాశాఖ (DEO) కు సమర్పించాలని ఆదేశాలు వెల్లడయ్యాయి.


ఆలస్య రుసుములు మరియు చెల్లింపు అవకాశం (SSC exam fee online payment)

  • రూ.50 ఆలస్య రుసుముతో: నవంబర్ 29 వరకూ ఫీజు చెల్లించవచ్చు.

  • రూ. 200 ఆలస్య రుసుముతో: డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు చెల్లింపు అవకాశం.

  • రూ. 500 ఆలస్య రుసుముతో: డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *