Si Shekar Reddy” ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డిని సన్మానించిన మజీద్ ఈద్గా కమిటీ సభ్యులు

Si shekar Reddy”  శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కేశవపట్నం మజీద్ ఈద్గా కమిటీ సభ్యులు శనివారం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆయన నూతనంగా కేశవపట్నం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మజీద్ కమిటీ అధ్యక్షులు ఖాజా మొయినోదిన్ మాట్లాడుతూ, “మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం మత పెద్దలు, ఈద్గా కమిటీ సభ్యులు ఎస్సైని మర్యాదపూర్వకంగా కలవడం, శుభాకాంక్షలు తెలియజేయడం హర్షదాయకం,” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంబాలాపూర్ మాజీ సర్పంచ్ మోహినుద్దీన్ రహీం, మజీద్ కమిటీ సెక్రటరీ మోయిన్, కొత్తగట్టు చాంద్ పాషా, తాడికల్ జమీల్, ఎరడపల్లి ఇమామ్‌తొ పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *