Tamilnadu Cm” చెన్నై | జూలై 21:
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అనారోగ్య కారణాలతో సోమవారం ఉదయం చెన్నై అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఉదయం వాకింగ్ సమయంలో అస్వస్థత కలగడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
వైద్యులు చెప్పిన వివరాలు:
అపోలో హాస్పిటల్స్ వైద్య సేవల డైరెక్టర్ డా. అనిల్ బీ.జీ మీడియాకు తెలిపిన ప్రకారం:
“ముఖ్యమంత్రి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రాథమికంగా తలతిరుగుడు వంటి తేలికపాటి లక్షణాలున్నాయన్నారు. అవసరమైన పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు.
షెడ్యూల్ రద్దు
ఈ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో, సీఎం స్టాలిన్ ఈరోజు హాజరయ్యే షెడ్యూల్‌లోని ముఖ్యమైన కార్యక్రమాలు తాత్కాలికంగా రద్దయ్యాయి.
️ ప్రజల్లో ఆందోళన – త్వరగా కోలుకోవాలన్న ఆకాంక్ష
CM స్టాలిన్ ఆరోగ్యంపై తమిళనాడు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాజకీయ, సామాజిక రంగాలవారు ఆకాంక్షలు తెలియజేశారు. అపోలో ఆసుపత్రి తదుపరి ఆరోగ్య బులెటిన్ విడుదల చేయనుంది.
