పోలీసులపై మండిపడ్డ టిడిపి నాయకులు
నల్లచెరువు సెప్టెంబర్ 19
తమ సొంత పనులపై కదిరికి వెళ్లే హక్కు కూడా మాకు లేదా అంటూ తనకల్లు, నల్లచెరువు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులపై విరుచుకుపడ్డారు.మంగళవారం తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ తో పాటు జిల్లా నాయకులతో కలసి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నివసిస్తూ కదిరిలో ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండలాల నుండి వెళ్లే తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను పోలీసులు ఎక్కడికి అక్కడ దిగ్బంధం చేశారు. ఇందులో భాగంగా తనకల్లు నల్లచెరువు మండలాలకు చెందిన నాయకులు తమ సొంత పనులతో పాటు కార్యక్రమానికి కదిరికి వెళుతుండగా స్థానిక పోలీస్ స్టేషన్ ముందు తనకల్లు, నల్లచెరువు పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులకు నాయకులకు కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది.నాయకులు మాట్లాడుతూ తమ సొంత పనులపై కదిరికి వెళుతుంటే తమలను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.తాము ర్యాలీలో పాల్గొనడానికి వెళ్ళడం లేదని తమ సొంతపనుపై వెళ్తున్నామని పోలీసులకు విన్నవించుకున్న పోలీసులు వారిని వదలకపోవడంతో నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ అధినేతను అక్రమంగా అరెస్టు చేస్తే నాయకులు కార్యకర్తలుగా మేము నిరసన తెలుపుకునే హక్కు కూడా మాకు లేదంటూ వాపోయారు.పోలీసుల వైఖరి మార్చుకోవాలని కోరారు.ప్రభుత్వాల అధికారం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమేనని పోలీసుల ఉద్యోగం 60 సంవత్సరాలు ఉంటుందని దానిని పోలీసులు గుర్తించుకోవాలని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడేది లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమంగా కేసు పెట్టి ఆయనకు అవినీతి మరక అంటించాలనే ఉద్దేశంతో ఉన్నాడన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించిన చంద్రబాబు నాయుడు పై ఆరోపణలు చేసి జైలుకు పంపడం హేయమైన చర్యని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యముల బయటికి వస్తారన్నారు. ఇ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తనకల్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నల్లచెరువు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
దెబ్బకు దెబ్బ.. కెనడాకు భారత్ ధీటైన సమాధానం..
భర్తను చంపింది… తొమ్మిందేండ్లకు దొరికింది.. ఇన్నాళ్లు ఆరా తీయలేదా…