హన్మకొండ, జూన్ 2:
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, “ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం” అనే థీమ్‌తో వరంగల్‌లోని కాకతీయ జూలోజికల్ పార్క్ (Kakatiya Zoological Park) లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ మరియు హన్మకొండ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 5న అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ విషయాన్ని ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల కోసం పోటీలు – జూన్ 4న
ఈ అవగాహన కార్యక్రమానికి ముందు రోజు, అంటే జూన్ 4 ఉదయం 10:00AM నుంచి మధ్యాహ్నం 12:00PM వరకు, విద్యార్థుల కోసం క్రింది పోటీలు నిర్వహించనున్నారు:
-
✏️ చిత్రలేఖన పోటీ
-
వ్యాసరచన పోటీ
-
వకృత్వ పోటీ
ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు:
-
బహుమతులు
-
పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్
వివిధ ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేయబడతాయి.
ముఖ్య అతిథులు
ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖ అతిథులు:
-
డీ. భీమా నాయక్, IFS – భద్రాద్రి & వరంగల్ క్షేత్ర ముఖ్య అటవీ సంరక్షణాధికారి
-
ప్రావిణ్య, IAS – హన్మకొండ జిల్లా కలెక్టర్ (గౌరవ అతిథి)
-
అనుజ్ అగర్వాల్, IFS – హన్మకొండ ఇంఛార్జి అటవీ అధికారి
-
మయూరి, FRO – కాకతీయ జూపార్క్ అటవీ అధికారి
ప్రత్యేక ఆకర్షణలు
-
అటవీ ఛాయాచిత్రాల ప్రదర్శన
-
వన సేవ స్వచ్చంద సంస్థ భాగస్వామ్యంతో పర్యావరణంపై విశేష సమాచారం
- హన్మకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారిణి మయూరి ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇందారం నాగేశ్వర్ రావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
ఎలా నమోదు చేసుకోవాలి?
పోటీల్లో పాల్గొనాలనుకునే విద్యార్థులు ముందుగా తమ పేర్లను నమోదు చేయాల్సి ఉంటుంది:
-
FRO మయూరి: 80199 19959
-
సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు: 98494 25271
పూర్తి వివరాలు ఈ నంబర్లకు కాల్ చేయడం ద్వారా పొందవచ్చు.
