Friday , 18 October 2024
Breaking News

26 మంది ఐఎఎస్‌ల బ‌దిలీ

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్‌ దత్‌ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీగా అహ్మద్‌ నదీమ్‌, సాగునీటిశాఖ క్యాదర్శిగా రాహుల్‌ బొజ్జా బదిలీ చేసింది. మొన్నటి వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా నియమించింది. మున్సిపల్‌ అడ్మినిస్టేష్రన్‌ డైరెక్టర్‌, ప్రజావాణి స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌ బాధ్యతలను డీ దివ్యకు అప్పగించింది. నల్గొండ కలెక్టర్‌గా హరిచందన దాసరిని బదిలీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న భారతీ హోళికెరికి ఆర్కియాలజీ బాధ్యతలను అప్పగించింది. రంగారెడ్డి కలెక్టర్‌గా కే. శశాంక, మహబూబాబాద్‌ కలెక్టర్‌గా అద్వైత్‌ కుమార్‌ను బదిలీ చేసింది. కార్మికశాఖ డైరెక్టర్‌గా క్రిష్ణ ఆదిత్య, మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయేషా మస్రత్‌ ఖానమ్‌ను నియమించింది. సీఎంవో కార్యాలయ జాయింట్‌ సెక్రెటరీగా సంగీత సత్యనారాయణ, సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరి క్రాంతి, జోగులాంబ కలెక్టర్‌గా బీఎం సంతోష్‌, హైదరాబాద్‌ స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌గా కధీరవన్‌, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా బీ వెంకటేశం, పీసీబీ సభ్య కార్యదర్శిగా జ్యోతి బుద్దా ప్రకాశ్‌, ఆయూష్‌ డైరెక్టర్‌గా ఎం ప్రశాంతి, ఫైనాన్స్‌ అండ్‌ ప్లానింగ్‌ ముఖ్య కార్యదర్శిగా డీ కృష్ణ భాస్కర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీగా ఆర్‌వీ కర్ణన్‌, జీఏడీ కార్యదర్శిగా రఘునందన్‌రావు, పంచాయతీ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇచ్చింది ఆరు హామీలు కాదు… 420 హామీలు.. బీఆర్ ఎస్ బుక్లెట్

ఏడేళ్ల జర్నీలో అన్నీ విజయాలే

About Dc Telugu

Check Also

Viral Video

Viral Video”దృఢ సంకల్పమే గెలుపున‌కు దారి తీస్తుంది… వీడియో వైర‌ల్

Viral Video” సంక‌ల్పం గ‌ట్టిద‌యితే సాధించ‌లేనిదంటూ ఏదీ ఉండ‌దు.. దీనిని ప‌లువురు అప్పుడ‌ప్పుడు నిరూపిస్తుంటారు. ఒక‌సారి ఒడితే మ‌రోసారి ప్ర‌య‌త్నించాలి. …

Samsung phone

Samsung phone” అతి త‌క్కువ ధ‌ర‌లో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్‌..రూ.6499 కే..

Samsung phone” అతి తక్కువ ధ‌ర‌లో సాంసంగ్ ఆన్‌డ్రాయిడ్ ఫోన్ ఆమెజాన్ ఆఫ‌ర్లో అందిస్తోంది. సాంసంగ్ గెలాక్సీ ఎం 05 …

18.10.2024 D.C Telugau Cinema Edition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com