Rajiv Gandhi Jayanti” సాంకేతిక, సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రవేశపెట్టిన మహానేత రాజీవ్..

Rajiv Gandhi Jayanti”   పేదల ఆశ జ్యోతి దివంగత మహానేత రాజీవ్ గాంధీ…
మాజీ జెడ్పిటిసి, టిపిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్..
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
భారతదేశానికి సాంకేతిక పరిజ్ఞానం , సాఫ్ట్ రంగాన్ని అందించిన, పేదల ఆశాజ్యోతి దివంగత మహానేత భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని టీపీసీసీ సభ్యులు, శంకరపట్నం మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండల కేంద్రంలో బుధవారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిపిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. దేశ ప్రధానిగా దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల కు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అందజేశారన్నారు. అగ్ర దేశమైన అమెరికాతో పోటీ తత్వాన్ని పెంచేందుకు భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగాన్ని భారత ప్రధాన మంత్రిగా ఉన్న దివంగత మహానేత రాజీవ్ గాంధీ దేశంలో ప్రవేశపెట్టి, దేశంలో సాంకేతిక రంగంలో విప్లహాత్మక మార్పులు తీసుకురావడానికి రాజీవ్ గాంధీ దోహదపడ్డారని తెలిపారు. భారతదేశం సాంకేతిక సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు దూసుకుపోవడానికి రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివని కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా అందించిన పలు సంక్షేమ పథకాలు నేటికీ పేద బడుగు బలహీన వర్గాలకు నేటికీ అందుతున్నాయన్నారు. రాజీవ్ గాంధీ దేశ బహుజనుల గుండెల్లో నేతికి నిలిచిపోయారని రాజీవ్ గాంధీ సేవలను శ్రీనివాస గౌడ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షులు బసవయ్య గౌడ్, కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షుడు మొలంగూరి సదానందం, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆడెపు అజయ్, మన కొండూరు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ షారుక్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు రెడ్డి పవన్ కుమార్, మాజీ సర్పంచులు గోడిశాల రాజ కొమురయ్య, తుమ్మేటి రాజిరెడ్డి, కొత్తగట్టు మచ్చ గిరింద్ర స్వామి మాజీ చైర్మన్ ఉప్పుగళ్ల మల్లారెడ్డి, నాయకులు ఇస్సాముద్దీన్, కీసర సంపత్, కవ్వ శ్రీనివాసరెడ్డి, భూమా ప్రవీణ్, సంతోష్, వీరయ్య, తో పాటు వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

BIGGIE BEAN BAG
ఇప్పుడు మీ హాల్, బెడ్‌రూం లుక్ మార్చేసే టైం!

⚽ స్పోర్ట్స్ థీమ్ లో అదిరిపోయే డిజైన్
️ 4XL సైజ్ – గమ్మత్తైన సోఫా కంఫర్ట్
✅ రెడీ ఫిల్డ్ – ఎలాంటి హాసిల్ లేదు
ఫ్రీ కుషన్ & ఫుట్‌రిస్ట్ తో అదనపు కంఫర్ట్
మెరుస్తున్న ఫాక్స్ లెదర్ ఫినిష్
బ్లాక్ & గ్రీన్ స్పోర్ట్స్ మూడ్ కలర్

ఇలాంటిది మీ గది లో ఉండాలి గదా?
అడుగు పెట్టండి – కంఫర్ట్ & స్టైల్ ఒకేసారి!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/45Ud8yR  లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *