Thursday , 21 November 2024
Breaking News

రెండు చోట్ల‌ ఎవ‌రెవ‌రు పోటీ చేశారు… ఎవ‌రు గెలిచారు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో ఈసారి మూడు ప్రధాన పార్టీ ల నుంచి ముగ్గురు కీలక అభ్యర్థులు రెండేసి నియోజకవర్గాలలో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. పాలక బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తన సిటింగ్‌ స్థానం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి ని యోజకవర్గంలోనూ ఈసారి పోటీ చేస్తున్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్‌ పై పోటీ చేస్తున్నారు. దాంతోపాటు గత ఎన్నికలలో తాను ఓటమి పాలైన కొడంగల్‌ నుంచి మరోసారి బరిలో నిలిచారు. బీజేపీకి చెందిన బీసీ నేత ఈటల రాజేందర్‌ తన సిటింగ్‌ స్థానం హుజూరాబా ద్‌లో పోటీ చేస్తుండడంతో పాటు గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతలూ తమ రాజకీయ జీవితంలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయడం ఇదే తొలిసా రి. కేసీఆర్‌ 2014 ఎన్నికలలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ అందులో ఒకటి అ సెంబ్లీ నియోజకవర్గం, రెండోది పార్లమెంట్‌ నియోజకవర్గం. ఆ ఎన్నికలలో కేసీఆర్‌ గజ్వేల్‌ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగి రెండు చోట్లా విజయం సాధించా రు. తెలుగు రాష్టాల్రలో ఇంతకుముందు పవన్‌ కల్యాణ్‌, చిరంజీవి, ఎన్టీఆర్‌, పీవీ నరసింహారావు కూ డా రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీ పడ్డారు. 2019 ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో పవన్‌ క ల్యాణ్‌ గాజువాక, భీమవరంల నుంచి పోటీ పడ్డారు. అయితే, రెండు చోట్లా ఆయనకు ఓటమే ఎదు రైంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలలో పోటీ చేసినప్పుడు పాలకొల్లు, తిరుపతి నియో జకవర్గాల నుంచి బరిలో నిలిచారు. అయితే, తిరుపతిలో విజయం సాధించిన ఆయన పాలకొల్లులో ఓడిపోయారు.ఎన్టీఆర్‌ 1985లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో కోస్తాలోని గుడివాడ, రాయలసీమలోని హిందూపురం, తెలంగాణలోని నల్లగొండ అసెంబ్లీ స్థానాల కు పోటీ చేశారు. మూడు చోట్లా గెలిచిన ఆయన నల్లగొండ గుడివాడ స్థానాలను వదులుకుని హిందూపురానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత 1989 ఎన్నికలలో ఆయన రెండు స్థానాల నుం చి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలోని హిందూపురం, మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలలో ఎన్టీఆర్‌ పోటీ చేశారు. కానీ, కల్వకుర్తిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చిత్తరంజన్‌ దాస్‌ చేతిలో ఎన్టీఆర్‌ ఓడిపోయారు.కమ్యూనిస్ట్‌ నాయకుడు రావి నారాయణరెడ్డి 1952 ఎన్నికల్లో నల్గొండ లోక్‌స భ, భువనగిరి శాసనసభ స్థానానికి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచిన ఆయన అసెంబ్లీ స్థానాన్ని వదులుకుని నల్గొండ లోక్‌సభ స్థానంలో కొనసాగారు. అదే ఎన్నికల్లో మరో కమ్యూనిస్ట్‌ నాయకుడు పెండ్యాల రాఘవరావు ఏకంగా మూడు స్థానాల నుంచి పోటీ చేసి మూడుచోట్లా గెలిచారు. వరంగ ల్‌ లోకసభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట శాసనసభా స్థానాలకు పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన అన్ని చోట్లా విజయం సాధించారు. వరంగల్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కాళోజీ నారాయణపై ఆయన గెలిచారు. అసెంబ్లీ స్థానాలను వదులుకుని వరంగల్‌ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే కాదు గతంలో వేర్వేరు రాష్టాల్ర సీఎంలు ఇలా రెండేసి నియోజకవర్గాల నుంచి పోటీచేసిన సందర్భాలున్నాయి. కర్ణాటక ప్రస్తుత ముఖ్యమం త్రి సిద్ధరామయ్య, మాజీ సీఎం కుమారస్వామి రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశా రు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో సిద్ధ రామయ్య బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. అందులో బాదామిలో విజయం సాధించి, చాముండేశ్వరిలో ఓటమి పాలయ్యా రు.కుమారస్వామి ఆ
ఎన్నికలలో చెన్నపట్న, రామనగర నియోజకవర్గాల నుంచి పోటీచేశారు. రెం డు చోట్లా గెలిచిన ఆయన రామనగర స్థానాన్ని వదులుకుని చెన్నపట్నకు ప్రాతినిధ్యం వహించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా 2019లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో రెం డు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.1991లో ప్రధాని పదవి చేపట్టిన పీవీ నరసింహారావు అప్పటికి పార్లమెంటు సభ్యుడిగా లేరు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నంద్యాలలో తమ పార్టీ నుంచి గెలిచిన గంగుల ప్రతాపరెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలలో పీవీని పోటీ చేయిం చింది. ఉప ఎన్నికలలో గెలిచిన పీవీ ఆ తరువాత 1996 ఎన్నికలలో నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపురం లోక్‌సభ సీటు నుంచి కూడా పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచిన ఆయన నంద్యాలను విడిచిపెట్టి బరంపురానికి ప్రాతినిధ్యం వహించారు. వీరే కాదు.. లోక్‌సభ విషయానికొస్తే ప్రధాని న రేంద్ర మోడీ, రాహుల్‌ గాంధీ, అటల్‌ బిహారీ వాజపేయీ, ఎల్‌కే అడ్వాణీ, సోనియా గాంధీ, ఇంది రాగాంధీ, ములాయం సింగ్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వంటి అనేక మంది నేతలు ఒకే ఎన్నికలలో రెండేసి స్థానాల నుంచి బరిలో నిలిచారు. వీరిలో మోదీ, రాహుల్‌, సోనియా, అడ్వాణీ, ఇందిర, ములాయంలు పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. లాలూ ఒక చోట గెలిచి మరోచోట ఓడిపోయారు. వాజపేయీ మూడు చోట్ల పోటీ చేయగా ఒక స్థానంలో గెలిచి రెండు స్థానాలలో ఓడిపోయారు.

 

న‌డి స‌ముద్రంలో హాలీవుడ్ సినిమా రేంజ్‌లో హెలికాప్టర్‌తో దాడి ఎటాక్‌… వీడియో రిలీజ్ చేసిన తిరుగుబాటు దారులు

ఆటో కాదిది స్కార్పిటో.. వీడియో మీరు చూడండి

త్రిషకు మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు

 

About Dc Telugu

Check Also

21.11.2024 D.C Telugu Morning News

21.11.2024 D.C Telugu Cinema News

Viral Video

Viral Video” ఒక‌రిని చూసి మ‌రొక‌రు.. కింద‌వ‌డి న‌వ్వుల‌పాలు వీడియో వైర‌ల్

Viral Video” తోటి వ్య‌క్తి తొడ కోసుకుంటే మ‌నం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత‌.. అచ్చం అలాగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com