హీరో సూర్య పరిచయం అక్కర్లేని పేరు. తెలుగుతో పాటు తమిళ, ప్రేక్షకులకు సుపరిచితం. అయితే సూర్య నటిస్తున్న కంగువా సినిమాను చాలా బీజిగా తెరకెకకిస్తున్నారు. ఇది దాదాపు అన్ని భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందు విడుదలైన టీజర్ కూడా బాగా వైరల్ అయ్యింది. కంగువా సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో హీరో సూర్యకి ప్రమాదం జరిగినట్టు వార్తలొస్తున్నాయి.. ఒక ఫైటింగ్ సీన్ షూట్ చేస్తున్న క్రమంలో కెమెరా ఒకటి మీద పడింది. దీంతో సూర్య భుజానికి గాయమైంది. వెంటనే సినిమా బృందం దగ్గర్లోని హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఈ సినిమాను డైరెక్టర్ శివ కాగా నిర్మాతలు జ్ఞానవేల్ రాజా, ప్రమోద్, వంశీ కృష్ణలు నిర్మిస్తున్నారు. సూర్యకు జరిగిన ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రెండు చోట్ల ఎవరెవరు పోటీ చేశారు… ఎవరు గెలిచారు..
త్రిషకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు
ఆ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపాపకు రూ. ఐదు వేల ఆర్థిక సాయం రేండ్ల శ్రీనివాస్ ఔదార్యం