మొలంగూర్ ఖిల్లా జాతీయ వారసత్వ సంపదగా గుర్తించాలని వినతి…
పర్యటక కేంద్రంగా గుర్తింపు సాధించి, పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటా …
కేంద్ర మంత్రులకు, శాఖ ముఖ్య అధికారులకు
వినతి పత్రాలు అందించిన సంజయ్ కుమార్..
శంకరపట్నం డిసి ప్రతినిధి

శంకరపట్నం మండలంలోని మొలంగూర్ ఖిల్లాను జాతీయ వారసత్వ సంపదగా గుర్తించాలని కేంద్ర పర్యాటకం మరియు సంస్కృతి శాఖకు బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వినతి చేశారు. ఈ విషయమై ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ సికావత్, సహాయ మంత్రి సురేష్ గోపి, సంస్కృతి శాఖ కార్యదర్శి అరుణిస్ చావ్లా, అదనపు కార్యదర్శి రాంజన చోప్రా, సంచాలకులు యశ్ వీర్ సింగ్ మరియు పర్యటక శాఖ కార్యదర్శి విద్యావతి, అదనపు కార్యదర్శి సుమన్ బిల్ల కార్యాలయాల్లో గురువారం వినతి పత్రాలు అందజేసినట్లు సంజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడారు. ఎంతో చరిత్రమైన మొలంగూర్ ఖిల్లా ప్రభుత్వ సంరక్షణ లేక, రాజకీయ నాయకుల అధికారుల పర్యవేక్షణ లేక అభివృద్ధికి దూరంగా ఉన్నదని వాపోయారు. పైపెచ్చు ఆ ఖిల్లను నాశనం చేయడానికి కాంట్రాక్టర్లు, బడాబాబులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో గ్రానైట్ వ్యాపారులు టెండర్లు కోరగా వాటిని రద్దు చేయాలని, మొలంగూర్ ఖిల్లాను పర్యటకంగా అభివృద్ధి చేయాలని, గతంలోనే కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పర్యాటకశాఖ కార్యదర్శి, జిల్లా కలెక్టర్, స్థానిక మండల రెవెన్యూ అధికారి లకు వినతి చేశానన్నారు. తద్వారా 19/2/2022 రోజున పురావస్తు శాఖ , సర్వే చేసినట్లు గుర్తు చేశారు, తదుపరి కార్యాచరణ కోసం ఆ ఖిల్లాను అభివృద్ధి చేయాలని, నిధులు మంజూరు చేయాలని, డిల్లీలోని అధికారులను కలిసినట్లు తెలిపారు. అధికారులు సానుకూలంగా స్పందించారని, తొందరలోనే జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు కోసం నోటిఫికేషన్ జారీ చేస్తామని అధికారులు తనకు తెలిపినట్లు చెప్పారు. అతి తొందరలో మొలంగూర్ ఖిల్లా కు జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపును సాధిస్తానని, ఖిల్లాను అభివృద్ధి చేసేదాకా పోరాటం చేస్తామని తెలిపారు.
/////////////////////////////////////////////////////////////////////
మహాసభలకు భారీగా తరలి రావాలి…
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిట్టల….
శంకరపట్నం డిసి ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ యూనియన్ మహాసభలకు కార్మికులు కర్షకులు భారీగా తరలిరావాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేంద్రంలో గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం మహాసభల గోడపత్రికలను సమ్మయ్య ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు, రాష్ట్రంలో జిల్లాలో మండలాల్లో భవనిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని, కార్మికుల సమస్యలపై ఈనెల 21 ,22 తేదీల్లో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్మికులు కర్షకులు ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి, కార్మికులు, కర్షకులు భారీగా హాజరై మహాసభలను విజయవంతం చేసి ,మన సమస్యలపై పోరాడడానికి, కార్మికులు సిద్ధం కావాలని, పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొజ్జ సోదానందం, మేకల పరమేష్ ,గోదారి లక్ష్మణ్ , వజ్ర రమేష్, బొజ్జ శ్రీనివాస్ , భవనిర్మాణ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
