Tpcc President”ఇల్లు ఇప్పించండి అధ్యక్షా…”

Tpcc President” అంబేద్కర్ సాక్షిగా టీపీసీసీ అధ్యక్షునికి బాధితుని వినతి
శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
దళిత వర్గానికి చెందిన కోడూరి సమ్మయ్య అనే బాధితుడు “ఇల్లు ఇప్పించండి అధ్యక్షా” అంటూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను అంబేద్కర్ విగ్రహం ముందు వేడుకున్నారు.

సోమవారం జరిగిన ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య తన బాధను టీపీసీసీ అధ్యక్షునికి వ్యక్తపరచగా, వెంటనే మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

ఈ సందర్భంగా కోడూరి సమ్మయ్య మాట్లాడుతూ, “నేను దళిత వర్గానికి చెందినవాడిని. అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఉండేందుకు ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా, గ్రామస్థాయిలో కొంతమంది నాయకుల అడ్డుపాటుతో నాకెప్పటికీ మంజూరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో భాగంగా శంకరపట్నంలో మహేష్ కుమార్ గౌడ్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే సమయంలో, అంబేద్కర్ సాక్షిగా ఆయనకు వినతి పత్రం అందించాను,” అన్నారు.

ఈ వినతిపై మహేష్ కుమార్ గౌడ్ “మీ సమస్యపై సానుకూలంగా స్పందిస్తా. మీకు న్యాయం జరగేలా చూస్తా” అని హామీ ఇచ్చినట్లు సమ్మయ్య తెలిపారు.

✨ బోష్ 9Kg ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్
5 స్టార్ రేటింగ్ | AI Active Water+ | Anti-Stain Power
ఇన్-బిల్ట్ హీటర్, Allergy Plus, Iron Steam Assist
Anti Tangle, Anti Wrinkle టెక్నాలజీ
Dark Silver లుక్స్‌తో ప్రీమియం ఫినిష్

ధర: ₹38,990 మాత్రమే! (25% తగ్గింపు)
200+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!

అమెజాన్లో కొనుగోలు కోసం  https://amzn.to/3JxC32I లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *