Mudiraj Hakkula” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
ముదిరాజ్ కులస్తుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ముదిరాజ్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి మహేష్ పిలుపునిచ్చారు.
సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో జిల్లా నాయకుడు కీసర సంపత్ ఆధ్వర్యంలో ముదిరాజ్ పోరాట సమితి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు మహేష్, “కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి. ముదిరాజ్ కులస్తులను బీసీ-డి గుంపు నుండి బీసీ-ఎ కేటగిరీలోకి మార్చాలి. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్లు బడ్జెట్ కేటాయించాలి. 57 ఏళ్లు నిండిన మత్స్య కార్మికులకు నెలకు రూ.5000 పెన్షన్ ఇవ్వాలి. మా వాటా మాకే కావాలి” అని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నవారు:
-
కునాచల మహేందర్ – జిల్లా అధ్యక్షుడు
-
ఉప్పరవేణి రంజిత్ – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
-
కాశబోయిన శేఖర్ – కార్యనిర్వాహక అధ్యక్షుడు
-
పెసరు కుమారస్వామి – మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వైస్ చైర్మన్
-
అట్టెం రమేష్ – రాష్ట్ర ఉపాధ్యక్షుడు
-
కోలా కరుణాకర్ – కార్యదర్శి
-
చెంది శ్రీనివాస్ – సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
-
సత్తి – దుబ్బాక ఇంచార్జ్
-
శ్రీకాంత్ – సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు
-
అరిగే ప్రభాకర్, రేగుల రాజేందర్ – మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్లు
-
రానవేణి మల్లయ్య – తాడికల్ సహకార సంఘం అధ్యక్షుడు
-
మత్స్య కారులు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు
ఈ సమావేశం ద్వారా ముదిరాజ్ కుల సంఘం ప్రభుత్వానికి తమ డిమాండ్లు స్పష్టంగా తెలియజేసినట్లు నేతలు తెలిపారు.

✨ బోష్ 9Kg ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్
5 స్టార్ రేటింగ్ | AI Active Water+ | Anti-Stain Power
ఇన్-బిల్ట్ హీటర్, Allergy Plus, Iron Steam Assist
Anti Tangle, Anti Wrinkle టెక్నాలజీ
Dark Silver లుక్స్‌తో ప్రీమియం ఫినిష్
ధర: ₹38,990 మాత్రమే! (25% తగ్గింపు)
200+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/3JxC32Iలింక్ పై క్లిక్ చేయండి..
