Viral Video” సోషల్ మీడియాలో పాపులర్ కావలన్న కోరిక ఒక్కో సారి ప్రాణాలమీదకు తెస్తుంది. రీల్స్ చేస్తూ ఇప్పటి కే చాలా మంది మృతి చెందారు. రీల్స్ చేస్తూ మరొకరి ప్రాణాలు కూడా బలిగొన్న సందర్భాలూ ఉన్నాయి. ఇదే కోవాలో ఓ మహిళ చిన్నారి ప్రాణాలను పణంగా పెట్టింది. మంచినీళ్ల బావి చివరన కూర్చొని రీల్స్ చేసింది. ఆ పాటకు ఆమె నృత్యం చేస్తున్నట్టు ఈ వీడియోలో మనం చూడొచ్చు. ఒక చేతిలో బాబును పట్టుకుని మరో చేతిని ఊపుతున్నది. ఆ చిన్నారి ఇంకొక చేతిలోకి తీసుకుంటూ ప్రమాదకరంగా నృత్యం చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని ఆర్టీసీఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దీనికి కింద విధంగా క్యాప్షన్ రాసుకొచ్చారు. ఇదెక్కడి పిచ్చి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెడుతారా అంటూ రాసుకొచ్చారు. ఇదీ ఎంతవరకు సమంజసమన్నారు. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాకు బానిసలు కాకండని సూచించారు. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయొద్దని పేర్కొన్నారు.
ఇదెక్కడి పిచ్చి. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలా పిల్లాడి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం. ఏమాత్రం తేడా వచ్చిన ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదమనే కనీస సోయి లేదు.
సోషల్ మీడియాకు బానిసలు కాకండి. ఫేమస్ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు చేయకండి. pic.twitter.com/rp4Qrk2kmn
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 22, 2024
ఇవి కూడా చదవండి
5G Phone” కేవలం రూ. 10 వేల 499 కే ఐక్యూ 5జీ ఫోన్…
Udupi Railway Station” రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడిన మహిళ.. కాపాడి సిబ్బంది. వీడియో
Dasara Holidays” బతుకమ్మ 13 రోజులు సెలవులు.. అక్టోబర్ 2 నుంచి 14 వరకు
Redmi LED Fire TV” 32 ఇంచుల టీవీ కేవలం కేవలం రూ. 11499 కే..