జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నీరజ సేవలు అభినందనీయం

– గ్రామ సర్పంచ్ పూదరి రాజు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ అందిస్తున్న సేవలు అభినందనీయమని గ్రామ సర్పంచ్ పూదరి రాజు ప్రశంసించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతంలో విద్యాభివృద్ధికి నీరజ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆమె సేవలను గుర్తించి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు మరియు జిల్లా స్థాయి అధికారులు శాలువాలతో సన్మానం చేయడం సంతోషకరమని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధన మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, గ్రామంలో నాణ్యమైన విద్య అందించేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని సర్పంచ్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శ్రీనివాసరావు దేశ్ముకు, బోప్పరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్‌లో 200 మంది డ్రైవర్లకు CPR శిక్షణ, ఉచిత కంటి పరీక్షలు


 జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో 200 మంది డ్రైవర్లకు సీపీఆర్ (CPR) శిక్షణతో పాటు ఉచిత కంటి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

 కరీంనగర్, ఆదివారం:
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు–2026లో భాగంగా 4వ రోజు కార్యక్రమంగా కరీంనగర్ జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది డ్రైవర్లకు CPR శిక్షణ, ఉచిత కంటి పరీక్షలు, జనరల్ హెల్త్ చెకప్ చేశారు.

ఇటీవల అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వల్ల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో, సీపీఆర్ ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు తెలిపారు. ఈ శిక్షణను తిమ్మాపూర్ పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్ ప్రణవ్ ప్రత్యక్షంగా డ్రైవర్లకు ప్రదర్శించి వివరించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పి. పురుషోత్తం మాట్లాడుతూ,
“ఆరోగ్యవంతమైన, దృష్టిలోపం లేని డ్రైవర్లతోనే సురక్షిత రహదారి ప్రయాణం సాధ్యమవుతుంది” అని అన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ ఆదేశాల మేరకు ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పుల్లారావు, ఉపేందర్, ఎంఎల్‌హెచ్‌పీ కుమార్, ఆప్టాల్మిక్ ఆఫీసర్ సురేష్, ఏఎన్‌ఎమ్‌లు, ఆయాలు పాల్గొన్నారు.

అలాగే ఈ కార్యక్రమంలో డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐలు రవికుమార్, నాగలక్ష్మి, కవిత, ఏఎంవీఐలు స్రవంతి, హరిత, రవాణాశాఖ సిబ్బంది, ఆర్&డీఈ కిరణ్, రక్షణ రోడ్ సేఫ్టీ ఫౌండేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ నీలం సంపత్** పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *