tamilanadu crime news” క‌ల్తీ సారా తాగి 32 మంది మృతి.. మ‌రో 30 మంది ప‌రిస్థితి విష‌మం

tamilanadu crime news

tamilanadu crime news”  తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ సారా తాగి 32 మంది మృతి చెందారు. మ‌రో 60 మంది వ‌ర‌కు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. కళ్లకురిచి జిల్లాలో నకిలీ మద్యం తాగి 32 మంది మృతిచెందిన‌ట్టు తెలుస్తోంది. 60 మంది పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విల్లుపురం, తిరువ‌ణ్ణ‌మ‌లై, సెలం, పుదుచ్చేరి ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చికిత్స తీసుకుంటున్న వారిలో 30 మంది ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. దీనిపై పోలీసులు, రెవెన్యూ అధికారులు విచార‌ణ చేశారు. ప్యాకెట్ అర‌క్ (సారా) తాగిన‌ట్టు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌లో క‌న్నుకుట్టి అనే వ్య‌క్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ‌సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించారు. కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ జతావత్‌పై బదిలీ వేటు వేయగా, కళ్లకురిచ్చి జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేశారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Crime news” డ్యాంలో తగ్గిన నీరు.. బయటపడ్డ కారు.. అందులో రెండు అస్థిపంజరాలు

Kaleswaram” మ‌హిళా కానిస్టేబుల్‌పై అత్యాచార ఘ‌ట‌న‌లో స‌ర్కార్ సీరియ‌స్‌.. కాళేశ్వ‌రం ఎస్‌.ఐ డిస్మిస్..

Karimnagar crime news” పిల్ల‌ల‌ను కాపాడ‌బోయి తండ్రి మృతి.. క‌రీంన‌గ‌ర్ లో విషాదం..

crime news” అడ్డుగా ఉన్నార‌ని అంతం.. ఓ చోట కొడుకును చంపిన త‌ల్లి.. మ‌రో చోట భ‌ర్త‌ను చంపిన భార్య

Hair cutting Viral Video” హెయిర్ క‌టింగ్ కు ఇన్ని కొల‌త‌లా..? స్కేల్.. గుండుదారం..? వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *