31.12.2025 శంక‌ర‌ప‌ట్నం వార్త‌లు

డబ్ల్యూజెఐ కార్యవర్గానికి కోమటిరెడ్డి అభినందన..
నేటి కరీంనగర్ :శంకరపట్నం:
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ (సూడా) చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అభినందించారు. డబ్ల్యూజేఐ అధ్యక్షుడు దారం జగన్నాథరెడ్డి నేతృత్వంలో కార్యదర్శి గుడాల శ్రీనివాస్, కోశాధికారి చిటిమల్ల మహేందర్, సంయుక్త కార్యదర్శులు, తెలంగాణ న్యూస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ డి ఎస్ ప్రసాద్, రమేష్ తదితరులు మంగళవారం తన నివాస గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో తన వంతు సహకారం ఉంటుందని నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పట్టణంలో అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల నివేషణ స్థలాల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రయోజనం చేకూరాలన్నది తమ ప్రభుత్వ అభిమతమని ఆయన తెలిపారు. డబ్ల్యూజేఐ కార్యవర్గం జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చని, సాధ్యమైనంత మేరకు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. డబ్ల్యూజేఐ నూతన కార్యవర్గం జర్నలిస్టుల సమస్యలతో పాటు,
ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతుందనే ఆశాభవం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూనియన్ కార్యవర్గ సభ్యులు పులి సంతోష్ గౌడ్, రామకృష్ణ, నాయకులు మైలారం తిరుపతి లు పాల్గొన్నారు.

సెల్ ఫోన్ అతి వినియోగంతో అనర్ధాలు

చదివే లక్ష్యంగా ముందుకు సాగాలి…
స్నేహిత లో డి అండ్ హెచ్ ఓ వెంకటరమణ పిలుపు…
నేటి కరీంనగర్: శంకరపట్నం :
సెల్ఫోన్ అతి వినియోగంతో ఎన్నో అనార్థాలకు దారితీస్తుందని విద్యార్థులు చదివే లక్ష్యంగా ముందుకు సాగాలని కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ విద్యార్థులకు సూచించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ పమేల సత్పటి ఆదేశం మేరకు స్నేహిత అవగాహన సదస్సును మంగ‌ళ‌వారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జరిగిన జిల్లా వైద్య అధికారి వెంకటరమణ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత చదువులే లక్ష్యంగా విద్యార్థి దశ నుండే ముందుకు సాగాల‌న్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడకంతో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని ప్రతి విద్యార్థిని విద్యార్థులు సెల్ఫోన్ వాడకాన్ని నిషేధించి పుస్తకాల పట్టణాన్ని, అవలంబించుకొని చదువులు చదువుతూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచాల‌న్నారు. మొదటి స్థానంలో ఉత్తీర్ణత సాధించి కన్న తల్లిదండ్రులకు , పాఠశాలకు ఉపాధ్యాయులకు పుట్టిన గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. బాల్యవివాళ్లు చట్టరీత్య నేరమని, వివాహాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ చందు, పాఠశాల ప్రిన్సిపాల్ కే ప్రభాకర్, మండల వైద్య అధికారి కొట్టే శ్రవణ్ కుమార్, డాక్టర్ శ్రావణి, జెండర్ స్పెషలిస్ట్ కవిత, ఐసిడిఎస్ సూపర్వైజర్ అరుణ, సూపర్వైజర్ అనిల్, సిహెచ్ఓ భాస్కర్, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు విద్యార్థిని ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

 

మొలంగూర్ లో ప్రభుత్వ భూములను కాపాడాలి…
అధికారుల నిర్లక్ష్యంపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం…
తెలంగాణ జన సమితి అధ్యక్షులు గణేష్….
నేటి కరీంనగర్ :శంకరపట్నం:
మొలంగూర్ గ్రామంలో ప్రభుత్వ భూములను కాపాడాలని, ఉన్నతాధికారులను మండల స్థాయి అధికారులు బెఖాతరు చేస్తున్నారని, తెలంగాణ జన సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మోరె గణేష్ అన్నారు. మంగళవారం మొలంగూర్ గ్రామంలో మోరె గణేష్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా  శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో 703 ప్రభుత్వ భూమి లో కొందరు ఆక్రమించారని తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయగా జిల్లా కలెక్టర్ స్పందించి మండల స్థాయి అధికారులకు జిల్లా పంచాయతీ అధికారికి భూమి ఆక్రమణపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి తగిన న్యాయం చేయాలన్నారు.  గ్రామంలోని నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించాలని, టీజేఏ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికైనా తాసిల్దార్, డిపిఓ స్పందించి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనము చేసుకొని, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని, గణేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దండు రాజేష్, గ్రామస్తులు కాలేసి శ్రీనివాస్, దాసరపు నరేష్, కొంకటి అంజి, కోరపెల్లి శివప్రసాద్, మోరె అజయ్, శ్రీకాంత్, కోరపల్లి శివ సాయి, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *