Ap-group-2″ అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–2 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఊరట కలిగే పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్–2 నియామకాల్లో అమలు చేస్తున్న రిజర్వేషన్ విధానాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
2023లో విడుదలైన గ్రూప్–2 నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ల అమలుపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించలేదని, అందుకే ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని వారు కోరారు.
ఈ అంశంపై వాదనలు విన్న హైకోర్టు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం అవసరం లేదని స్పష్టం చేస్తూ, రిజర్వేషన్లను సవాల్ చేసిన అన్ని పిటిషన్లను తిరస్కరించింది. దీంతో గ్రూప్–2 నియామక ప్రక్రియ కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
