Local news”గద్దపాకలో పేకాటరాయుళ్ల అరెస్ట్…

Local news” 8,800 వేల నగదు,
ఆరుగురు పై కేసు నమోదు..
శంకరపట్నం: డిసి ప్రతినిధి
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయల ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు కేశవపట్నం ఎస్ఐ కొత్తపల్లి రవి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రవి పూర్తి వివరాలను వెల్లడించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని, కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గల గద్దపాక గ్రామ శివారులో పేకాట స్థావరంపై కేశవపట్నం పోలీసులు, జిల్లా టాస్క్ఫోర్స్ పోలసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించిన‌ట్టు చెప్పారు. ఈ దాడిలో పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకున్నామ‌న్నారు. వారి వద్ద 8వేల 8వందల రూపాయలు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్న‌ట్టు వెల్ల‌డించారు. ఆరుగురు పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *