Jaipur news” వెండి గాజులు ఇవ్వ‌కుంటే అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నివ్వ‌ను

Jaipur news”  మాన‌వ సంబంధాల‌న్నీ మ‌నీ సంబంధాలేన‌న్న ఓ ఆర్థిక శాస్త్ర‌వేత్త మాట‌లు నిజ‌మ‌వుతూనే ఉన్నాయి.. ఈ రోజుల్లో మనుష‌ల‌కంటే డ‌బ్బు, ఆస్తి, వాటాలే ముఖ్య‌మంటున్నారు. ర‌క్త సంబంధాలు సైతం వాటా విష‌యంలో త‌గువుకు దిగుతున్నారు. తల్లి ఆభరణాల్లో వాటా కావాలని అంత్యక్రియలు జ‌ర‌గ‌కుండా చిన్న కొడుకు అడ్డుప‌డ్డాడు. ఆభ‌ర‌ణాల్లో త‌న‌కు వాట ఇవ్వ‌క‌పోతే త‌న‌ను కూడా చితిలో కాల్చి వేయండంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు. ఈ ఘట‌న క‌లిచి వేసే ఘ‌ట‌న రాజ‌స్తాన్‌లోని
జైపూర్ – విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన 80 ఏండ్ల మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పటి వరకు ఆమె బాధ్యతల‌ను పెద్ద కొడుకు చూసుకున్నాడు. అయితే ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు, ఇతర బంగారు ఆభరణాల‌ను కుటుంబ పెద్ద కొడుకుకి అప్పగించారు. దీంతో ఆగ్ర‌హించిన చిన్న కొడుకు
తల్లి ఆభరణాలలో తనకు వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. తనకు ఆభరణాల్లో వాటా ఇచ్చాకే తల్లి అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశాడు. లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చి వేయండంటూ చితిపై పడుకొని బీభత్సం సృష్టించాడు. చివరకు ఆభరణాలు అతడికి అప్ప‌గించారు. దీంతో తల్లికి అంత్యక్రియలు పెద్ద‌కొడుకు నిర్వహించాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *