Accident” శంకరపట్నం, (డిసి ప్రతినిధి):
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మంగళవారం చోటు చేసుకున్న రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది.
గ్రామస్థులు, 108 వాహన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం —
శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన చామంతుల సుధాకర్, తన కూతురుతో మొగిలిపాలెం గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కరీంపేట శివారులో కి రాగానే మరో బైక్‌తో ఎదురెదురగా ఢీ కొన్నాయి.
మరో బైక్‌ను మొగిలిపాలెం గ్రామానికి చెందిన చిన్నబోయిన రాహుల్ నడుపుతున్నాడు. అతను మానకొండూర్ మండలంలోని కొండపలకలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ సంఘటనలో సుధాకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించగా, సిబ్బంది ఈఎన్టీ గూడూరి సతీష్ రెడ్డి మరియు మతి గోపికృష్ణ ఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించారు.
తర్వాత మెరుగైన వైద్యం కోసం గాయపడిన సుధాకర్‌ను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.
