Shankarapatnam News” శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ రాజిరెడ్డిని ఘనంగా సన్మానించిన మాజీ సర్పంచ్

shankarapatnam News”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – దశావతారాలలో మత్స్యావతారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్న శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం (కొత్తగట్టు గుట్ట, శంకరపట్నం మండలం) కొత్తగా నియమిత చైర్మన్ కోరెం రాజిరెడ్డిని కన్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ సదానంద చారి బుధవారం ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తాటికొండ సదానంద చారి మాట్లాడుతూ..  కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజిరెడ్డిని ఈ దేవస్థానం చైర్మన్‌గా నియమించడం అభినందనీయం అన్నారు. భక్తులకు సేవ చేయడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజిరెడ్డికి శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ కుమార్ ఇతర స్థానిక నాయకులతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *