-Road-accident help” బాధితుడి కృతజ్ఞతలు, గ్రామస్తుల అభినందనలు
శంకరపట్నం డీసి ప్రతినిధి
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా, ఆశా కార్యకర్త జహేదా సమయస్ఫూర్తితో స్పందించి ప్రథమ చికిత్స అందించారు.
శనివారం ఉదయం, మండలంలోని ఆముదాలపల్లి గ్రామానికి చెందిన మొందడి శ్రీధర్ రెడ్డి వ్యక్తిగత అవసరాల కోసం మొలంగూర్ మార్గంలో ప్రయాణిస్తుండగా, మొలంగూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమీపంలో ద్విచక్ర వాహనం నుంచి బోల్తా పడి గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త జహేదా ఘటన స్థలానికి వెంటనే చేరుకొని, వృత్తి నైపుణ్యంతో ప్రథమ చికిత్స అందించారు.
గాయాలపై తొందరగా స్పందించిన జహేదా సేవలు గ్రామస్తులు, బాధితుడు శ్రీధర్ రెడ్డి హృదయపూర్వకంగా అభినందించారు.
