Ammamata” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐసిడీఎస్ సిడిపిఓ శ్రీమతి పేర్కొన్నారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ‘అమ్మ మాట – అంగన్వాడి బాట’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ శ్రీమతి మాట్లాడుతు మాట్లాడుతూ:
“అర్హులైన గర్భిణీ స్త్రీలు, 3–5 ఏళ్ల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేయించుకుని పౌష్టికాహారం, ప్రాథమిక విద్య, ఆటపాటలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను పొందాలి” అని సూచించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం, విద్యా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, అంగన్వాడీ సేవలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో:
-
అంగన్వాడీ సూపర్వైజర్ అరుణ,
-
బీసీ ప్రణీత,
-
కారోబార్ సంపత్,
-
అంగన్వాడీ టీచర్లు,
-
ఆయాలు,
-
గర్భిణీ స్త్రీలు,
-
మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
