Mla-kavvampalli” జిల్లా ఇన్చార్జి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

Mla-kavvampalli” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమితులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం లు కూడా ఉన్నారు. వారు హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రి తుమ్మలతో చర్చించారని ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *