Kesavapatnam Si” శంకరపట్నం డిసి ప్రతినిధి:
కరీంనగర్ కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఇటీవల ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన కట్కూరి శేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఊకంటి మధుకర్ మాట్లాడుతూ, “నూతన ఎస్సై శేఖర్ రెడ్డి సేవా దృక్పథంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు. శాలువాతో ఘనంగా సన్మానం చేసి, ఆయన్ను సాదరంగా స్వాగతించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సూరం శ్రీనివాస్, తాడికల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ సభ్యులు కలకుంట్ల సత్యనారాయణ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవరాజు, కుంట తిరుపతిరెడ్డి, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
