Kharge meeting” హైదరాబాద్, జూలై 4: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే హాజరయ్యే భారీ సమావేశానికి హాజరయ్యేందుకు కరీంనగర్ జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ వైపు బయలుదేరారు. శుక్రవారం ఈ విషయాన్ని టిపిసిసి సభ్యుడు, శంకరపట్నం మండల మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయినుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు పాల్గొనే సమావేశాన్ని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి వాహనాల్లో అధిక సంఖ్యలో కార్యకర్తలు బయలుదేరుతున్నారు,” అన్నారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు మానకొండూర్ నియోజకవర్గం నుండి నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలు సమావేశానికి తరలిపోతున్నారు.
ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో కీలకంగా మారనుందని, పార్టీలో కార్యాచరణపై మార్గనిర్దేశం జరగనుందని సమాచారం.
Ponnam Prabhakar” కేసీఆర్ ఆరోగ్యం పై మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్
Pm Modi” ఘనా జాతీయ అవార్డు మోడీ కి రావాడానికి కారణమిదే.. ఇంతకు ముందు ఎవరెవరికి వచ్చిందంటే
Illegal immigrants” 2025అమెరికా సరిహద్దుల్లో పట్టుబడుతున్న భారతీయులు
