Ahmedabad” అహ్మదాబాద్, జూలై 25:
నవరంగ్పురాలోని ఓ ప్రయివేట పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని గురువారం మధ్యాహ్నం పాఠశాల భవనం నాలుగో అంతస్తు నుండి దూకిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ బాలిక తలకు తీవ్ర గాయాలు రావడంతో ప్రస్తుతం థల్తేజ్లోని ప్రైవేట్ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
స్నేహితుల ముందే ఆత్మహత్యాయత్నం
ఈ ఘటన గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో జరిగింది. ఇంటర్వెల్ సమయంలో విద్యార్థిని భవనంపై ఉన్న పరపెట్ వద్దకు నడిచి వెళ్లగా, ముగ్గురు నుండి నలుగురు తోటి విద్యార్థులు ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. ఒకరు ఆమె చేతిని పట్టుకుని నిలిపే ప్రయత్నం చేసినా, ఆమె తప్పించుకుని దూకేసినట్లు స్కూల్ అధికారులు తెలిపారు.
తీవ్ర గాయాలు – ఐసీయూ లో చికిత్స
కిందపడి తీవ్ర గాయాలైన విద్యార్థినిని 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను మరింత మెరుగైన చికిత్స కోసం థల్తేజ్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. తలకు గాయాలు, ఎముకలు విరగడం వంటి తీవ్ర గాయాలతో ఆమె ప్రస్తుతం కోమాలో ఉన్నారు.
పోలీసులు విచారణ ప్రారంభం
నవరంగ్పురా పోలీసులు మెడికో లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో ఉండిన సిబ్బంది, విద్యార్థులపై విచారిస్తున్నారు.
ఇన్స్పెక్టర్ ఎ.ఏ. దేశాయి మాట్లాడుతూ, “ఆమె ఎందుకు ఈ ప్రయత్నానికి పాల్పడిందో ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె ఆరోగ్యం మెరుగవ్వగానే, ఆమెతో మాట్లాడతాం” అని చెప్పారు.
#Gujarat #Ahmedabad tragedy: A 16‑year‑old Class 10 student at Som Lalit School jumped from the 4th floor lobby during recess on July 24. CCTV showed her twirling a keychain moments before. Friends tried to stop her, but she jumped. 1/2 pic.twitter.com/Whu6R6jwMt
— Siraj Noorani (@sirajnoorani) July 25, 2025
ఇక దోమలకు గేమ్ ఓవర్!
All Out Mosquito Kill Racquet తో మీ రక్షణ ఇప్పుడు మీ చేతిలో! ⚡
⚡ 2X ఫాస్ట్ చార్జింగ్ – వేగంగా చార్జ్ అవుతుంది
లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ – ఎక్కువ గంటలు పని చేస్తుంది
దోమలు కనిపించగానే తక్షణమే అండర్ కంట్రోల్!
IMA (Indian Medical Association) సిఫార్సుతో నమ్మకమైన ఉత్పత్తి
️ 6 నెలల వారంటీ – నాణ్యతకి గ్యారంటీ!
రాత్రి నిద్రకు అంతరాయం లేకుండా – ఇక డేంజర్ దోమలకి ఫినిష్!
ఇంటి వద్దనైనా, ఔటింగ్లోనైనా – ఇది తప్పనిసరి గ్యాడ్జెట్!
ఇప్పుడే ఆర్డర్ చేయండి – ఆరోగ్యానికి ముందస్తు రక్షణ తీసుకోండి!
అమెజాన్లో కొనుగోలు చేసేందుకు https://amzn.to/4o6ey09 లింక్ పై క్లిక్ చేయండి..
