Janasena” రాకేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం..

Janasena”  శంకరపట్నం డిసి ప్రతినిధి
విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందిన మూల రాకేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినట్లు జనసేన పార్టీ జిల్లా నాయకులు న్యాంతబాద్ జనార్ధన్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం వంకాయ గూడెం గ్రామానికి చెందిన మూల రాకేష్ గౌడ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన విష‌యం తెలిసిందే. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ ఆదేశం మేరకు మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి పడాల ప్రసాద్ గౌడ్ గౌడ్ ఆధ్వర్యంలో రాకేష్ కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు 51 వేల 500 రూపాయలను అందజేసి, పార్టీ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ను కూడా అందజేయుటకు కృషి చేస్తామని జనార్ధన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గం ఇంచార్జ్ మాయ రమేష్, హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ తగరపు శ్రీనివాస్, నాయకులు వోడ్నాల రామారావు చిట్టి ఉదయ్ కుమార్ రెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వర్షాల కోసం … కేవ‌లం రూ. 215
మెన్ & ఉమెన్ కోసం యూనిసెక్స్ రెయిన్ కోట్
వాటర్‌ప్రూఫ్, రీయూసబుల్, లైట్‌వెయిట్
ఫ్యాషనబుల్ & యూనివర్సల్ సైజ్
కేవలం ₹215 మాత్రమే! (37% తగ్గింపు)
1K+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!

ఇప్పుడే ఆర్డర్ చేయండి!  https://amzn.to/4ohNETq లింక్ పై క్లిక్‌చేసి అమెజాన్‌లో కొనుగోలు చేయండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *