Farmers” రైతుల‌కు గుడ్ న్యూస్‌.. 5 రోజుల్లో ఆ డ‌బ్బులు జ‌మ

Farmers”  ఖమ్మం, జూలై 30: రైతుల కోసం మంచి వార్తను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన–ప్రగతి బాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుకు వచ్చే ఐదు రోజుల్లోనే ప్రతి రైతుకు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో తాజా అభివృద్ధిని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మందిని లబ్ధిదారుల జాబితాలో చేర్చినట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క రేషన్‌ కార్డూ ఇవ్వలేకపోయారని విమర్శిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం 18 నెలల్లోనే సుమారు 5.6 లక్షల రేషన్‌ కార్డులు పంపిణీ చేసిన విషయాన్ని  వెల్ల‌డించారు.

మహిళల ఆర్థిక సాధికారత కోసం 65 లక్షల మంది మహిళలకు సున్నా వడ్డీపై రూ.25 వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే, డ్వాక్రా సభ్యత్వానికి గతంలో ఉన్న వయోపరిమితిని తొలగించి, 15 సంవత్సరాల వయస్సు నుంచే అర్హత కల్పించామని, వృద్ధాప్య పెన్షన్‌కు వయస్సు పరిమితిని 60 నుంచి 65 ఏళ్లకు పెంచినట్టు వివరించారు.

ఇందిరమ్మ హయాంలో లక్షలాది మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణానికి ఐదువేల కోట్లు అదనంగా ఖర్చవుతున్నా, ప్రభుత్వంపై ఇది భారం కాదని స్పష్టం చేశారు. ప్రతి అర్హుడికి ఇంటి కలను నెరవేర్చే బాధ్యత తనదేనంటూ, ప్రజల మధ్య ఓ పెద్ద కుటుంబ సభ్యులా ఉండటమే తన విధానమని పేర్కొన్నారు.

 

ఒదోనిల్ తో మీ బాత్రూమ్ కి పరిమళ వాతావరణం!
Odonil Bathroom Air Freshener Zipper Mix

✨ 2 సూపర్ కాంబోలు:
50గ్రా (10గ్రా x 5) – Citrus, Jasmine, Rose, Lavender, Floral
30గ్రా (10గ్రా x 3) – Citrus, Jasmine, Lavender

ఒక్కసారి ఉంచితే 30 రోజులు వరకూ ఫ్రెష్ వాసన!
జర్మ్ ప్రొటెక్షన్ తో సహా
వేల మందికి రేటింగ్ – 4.3 స్టార్స్ ⭐⭐⭐⭐✰

ధరలు pocket-friendly – ఇప్పుడే ట్రై చేయండి!
https://amzn.to/46BmFM2లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *