Kanapur” శంకరపట్నం, కరీంనగర్:
కన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్కింద పల్లెలో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన ఘటనపై స్థానిక కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఏమైందంటే?
కిష్కిందపల్లె కాలనీలో 2008లో సిసి రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. అయితే కాలనీవాసుల ఫిర్యాదు ప్రకారం, అదే కాలనీలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఆ శిలాఫలకాన్ని గుంజాతో ధ్వంసం చేశాడని ఆరోపించారు.
అధికారులకు వినతిపత్రం
ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, కాలనీవాసులు శంకరపట్నం మండల తహసీల్దార్ కే. సురేఖ మరియు మండల అభివృద్ధి అధికారి గోల్కొండ కృష్ణ ప్రసాద్లకు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. శిలాఫలకాన్ని పునర్నిర్మించి, పాలుపంచుకున్న వారి కృషికి గౌరవం కలిగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

నెట్ సారీస్ మెగా ఆఫర్ !
⚡ కనీసం 60% డిస్కౌంట్
✨ Womanista, Siril & ఇంకా చాలా బ్రాండ్స్ పై!
స్టైల్ & ఎలిగెన్స్ కలిపిన లుక్…
ఇప్పుడే బుక్ చేయండి
ట్రెండింగ్ నెట్ చీరలు తక్కువ ధరకే!
️ డీల్స్ ఈరోజే… లేటవ్వకండి!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/4mw2q7iలింక్‌పై క్లిక్ చేయండి..
