Modi Cycle Gift” విద్యార్థులను ప్రోత్సహించడమే కేంద్ర మంత్రి ధ్యేయం..
సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో బిజెపి నాయకులు..
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
ప్రభుత్వ పాఠశాలలోనే నైపుణ్యమైన విద్య లభిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులను ప్రోత్సహించేందుకే కరీంనగర్ ముద్దుబిడ్డ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, పదవ తరగతి విద్యార్థులకు సైకిలను అందజేయడం జరుగుతుందని, గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు వినియోగించుకోవాలని, బిజెపి మండలాధ్యక్షుడు ఎనుగుల అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డిలు అన్నారు. గురువారం కొత్తగట్టు ,కన్నాపూర్ , మెట్ పల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మోదీ కానక సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ ,వెంకటరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని ప్రభుత్వపరంగా అనేక సదుపాయాలు కల్పిస్తున్న సందర్భంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ , మోడీ నేతృత్వంలో పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న నిరుపేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారని రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరిన్ని సదుపాయాలు కల్పించుటకు సిద్ధంగా ఉన్నారని, రాబోయే రోజుల్లో మిగతా తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడ ఈ పథకాన్ని విస్తరింపజేయనున్నట్లు పేర్కొన్నారు. సైకిళ్లు మోది కానుకగా తీసుకున్న విద్యార్థులు పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కానుక ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, బిజెపి నాయకులు దొంగల రాములు, కనకం సాగర్, ఇంద్రసేనారెడ్డి. రాసమల్ల శ్రీనివాస్, చుక్కల శ్రీకాంత్, దాసరి సంపత్ ఎలుకపెల్లి సంపత్, కాల్వ రమణారెడ్డి. పిన్ రెడ్డి సంపత్ రెడ్డి కొండల్ లతో ఆయా గ్రామాల బూత్అధ్యక్షులు తో పాటు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

టీవీ వివరాల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి
Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్‌లో హైఎండ్ ఫీచర్లు!
ఇవి సుతా చదవండి
Gold Price” పసిడి పరుగులు – లక్షా పదివేలు వైపు దూసుకుపోతున్న బంగారం ధరలు
HP All-in-One” డెస్క్‌టాప్ – మీ ఇంటి/ఆఫీసు కోసం స్టైలిష్ & పవర్‌ఫుల్ పిసి!
BoatAccident” నైజీరియాలో పడవ ప్రమాదం – 60 మంది మృతి.. మిగతావారికోసం గాలింపు కొనసాగుతుంది..
