Ganesh Immersion” గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు..

Ganesh Immersion”  భక్తులకు సౌకర్యాలు కల్పించాలి..
అధికారులకు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి ఆదేశం..
శంకరపట్నం డిసి ప్రతినిధి
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ గ్రామపంచాయతీ ఆవరణలో నిమజ్జనం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, రాజకీయ పక్షాల నాయకుల తో గురువారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు అధికారులను ఆదేశించారు.
సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు లేక్ వ్యూ వద్ద మూడు పెద్ద క్రేన్లతో పాటు చిన్న క్రేన్లను అందుబాటులో ఉంచుతున్నట్టు ఆయన చెప్పారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వినాయక నిమజ్జనానికి వ‌చ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. మంచినీరు,వైద్య సేవలు కల్పిస్తామని ఆయన చెప్పారు. అన్ని శాఖల అధికారులు ఇక్కడే అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్,డీపీఓ, మానకొండూర్ ఎంపీడీవో, తహశీల్దార్, వివిధ శాఖల అధికారులతోపాటు మానకొండూరు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి నరేష్, మడుపు ప్రేమ్ కుమార్, కొండ సురేష్, ఇర్ఫాన్, మాతంగి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

టివీ వివ‌రాల కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి..

Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్‌లో హైఎండ్ ఫీచర్లు!

 

ఇవి సుతా చ‌ద‌వండి

Gold Price” పసిడి పరుగులు – లక్షా పదివేలు వైపు దూసుకుపోతున్న బంగారం ధరలు

BoatAccident” నైజీరియాలో పడవ ప్రమాదం – 60 మంది మృతి.. మిగతావారికోసం గాలింపు కొనసాగుతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *