Uttama Upadhyayudu” ఉత్తమ ఉపాధ్యాయునిగా ప్రశంస పత్రం అందుకున్న నారాయణ…

Uttama Upadhyayudu”  సత్కారం చేసిన ఉపాధ్యాయ బృందం…
గ్రామస్తుల అభినందనలు…
శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రభుత్వ పాఠశాలల కస్టర్ రిసోర్స్ పర్సన్ గా విధులు నిర్వహిస్తున్న మరాటి నారాయణ సేవలను గుర్తించి పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తించి సోమవారం సత్కరించారు. కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన మరాఠీ నారాయణ వీణవంక మండలం కస్టర్ రిసోర్స్ పర్సన్ గా 15 సంవత్సరాల నుండి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను తల్లిదండ్రులను ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసానికి ప్రోత్సహించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు అహర్నిశలు కృషిచేసిన మరాఠీ నారాయణను మండల పాఠశాల విద్యాధికారులు పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉత్తమ సేవా ప్రశంస పత్రం, మెమొంటో అందజేసి శాల్వాలతో నారాయణ సత్కరించి ఆయన సేవలను గుర్తించారు. మొలంగూర్ గ్రామానికి చెందిన నారాయణ ఉపాధ్యాయ వృత్తిలో ఎనలేని కృషి చేసినందుకు గ్రామ తాజా మాజీ సర్పంచ్లు మోరె అనూష శ్రీనివాస్, దండు సాయిలు, రాయిని శంకరయ్య, నరహరి శారదా బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ వావిలాల రాజు, గ్రామస్తులు మిత్ర బృందం హర్షం వ్యక్తం చేసి నారాయణను అభినందించారు.

 

Dasara Holidays” ద‌స‌రా సెల‌వుల షెడ్యూల్ ప్ర‌క‌ట‌న‌

Hisense” హైసెన్స్ 43E6N స్మార్ట్ 4K గూగుల్ టీవీ – బడ్జెట్‌లో హైఎండ్ ఫీచర్లు!

Electric Vehicles” ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ మినహాయింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *