Voterlist”ఓటరు జాబితాపై అభ్యంతరాలు తెలియజేయాలి

Voterlist” అభ్యంతరాలు తెలియజేయాలి : అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే

మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాపై రాజకీయ పార్టీలతో సమీక్ష

కరీంనగర్:
మున్సిపాలిటీలకు సంబంధించి విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఏవైనా లోపాలు, అభ్యంతరాలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.

మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఓటరు జాబితాపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ మున్సిపాలిటీల పరిధిలో మరణించిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు చోట్ల కాకుండా ఒకే ప్రాంతంలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని, పోలింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని కూడా సూచించారు.

దీనికి స్పందించిన అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో వార్డు వారీగా ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు. అందిన అభ్యంతరాలు, వినతులను పరిశీలిస్తున్నామని చెప్పారు. మరణించిన ఓటర్లు లేదా ద్వంద్వ నమోదైన ఓట్ల వివరాలు ఉంటే తెలియజేయాలని, అర్హత లేని ఓట్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లు నాగరాజు, అయాస్, సమ్మయ్యతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు వై. సునీల్ రావు, నాంపల్లి శ్రీనివాస్ (బీజేపీ), చల్లా హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్ (బీఆర్‌ఎస్), మడుపు మోహన్ (కాంగ్రెస్), పైడిపల్లి రాజు (సీపీఐ), మిల్కూరి వాసుదేవ రెడ్డి (సీపీఐఎం), తేజ దీప్ రెడ్డి (ఏఐఎఫ్‌బీ) తదితరులు పాల్గొన్నారు.

✨ VOLTURI మైక్రోఫైబర్ ఫెదర్ డస్టర్ ✨

ఇప్పుడే మీ ఇంటి శుభ్రత మరింత ఈజీ! 🧹 

👉 దుమ్ము దులుపుకోవడం క్షణాల్లో పూర్తి!

అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/49rb7uB లింక్ పై క్లిక్ చేయండి

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

కరీంనగర్:
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో, కరీంనగర్ ట్రాఫిక్ పోలీసు శాఖ సమన్వయంతో పట్టణంలోని వివేకానంద డిగ్రీ కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వాహనాలు నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు, రోడ్డు నియమాలు ఉల్లంఘిస్తే ఎదురయ్యే చట్టపరమైన శిక్షలు గురించి వివరించారు. మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలు పాటించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి, అంగవైకల్యాలు లేదా ప్రాణనష్టం కలగవచ్చని అవగాహన కల్పించారు.

రోడ్డు నియమాలను నిర్లక్ష్యం చేయడం వల్ల యువత తమ విలువైన భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకుంటున్నారని, కావున ప్రతి విద్యార్థి బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు భద్రతకు సంబంధించిన నియమాలను తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరీముల్లా ఖాన్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తానకు మహేష్, ఎస్సై గణేష్, కళాశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

ఈ ఆఫ‌ర్‌ను అమెజాన్‌లో చూసేందుకు లింక్ https://amzn.to/4suDNvu పై క్లిక్ చేయండి

స్నేహిత కార్యక్రమం–2లో భాగంగా

చెల్పూర్ హైస్కూల్‌లో అవగాహన సదస్సు

కరీంనగర్, :స్నేహిత కార్యక్రమం–2లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు, పీఓ ఎన్‌సీడీ డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ తులసీదాస్ కలిసి చెల్పూర్ జిల్లా పరిషత్ హై స్కూల్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా బాలికల భద్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

అవగాహన కల్పించిన ముఖ్య అంశాలు:

  • బాలికలకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అవగాహన మరియు పోక్సో చట్టం వివరాలు

  • మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు

  • సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం, గ్రహణశక్తి పెంపొందించుకోవడం

  • వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ ప్రాముఖ్యత

  • యుక్త వయస్సు బాలికలకు రుతుస్రావ పరిశుభ్రతపై అవగాహన

  • పాఠశాలల్లో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం పొందడం

  • బాలికల వేధింపుల నివారణకు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ వినియోగం

  • ‘షీ టీమ్స్’ సహాయంతో సమస్యలను పరిష్కరించుకునే విధానం

ఈ కార్యక్రమం ద్వారా బాలికల్లో భద్రతపై అవగాహన, ఆరోగ్య పరిరక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా భరోసా కల్పించారు.

ఇతర కార్యక్రమాలు:

ఈ సందర్శనకు ముందు హుజురాబాద్ ప్రాంతీయ ఆసుపత్రిలోని ఎన్‌సీడీ క్లినిక్‌ను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆశా కార్యకర్తల సమావేశంలో పాల్గొని, పీహెచ్సీ డెలివరీల సంఖ్య పెంచేందుకు గర్భిణీలను ప్రోత్సహించే విధానాలపై మార్గదర్శకాలు అందించారు.

ఈ కార్యక్రమంలో పీఓ ఎన్‌సీడీ డాక్టర్ ఉమాశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు, చెల్పూర్ పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ తులసీదాస్, హెచ్‌ఈఓ విజయేందర్ రెడ్డి, వైద్య సిబ్బంది, చెల్పూర్ హైస్కూల్ హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ ఆఫ‌ర్‌ను అమెజాన్‌లో చూసేందుకు లింక్ https://amzn.to/4suDNvu పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *