అయ్యప్ప మాలదరణ భక్తుల దర్శన యాత్రకు బిక్ష ఏర్పాటు
నేటి కరీంనగర్ శంకరపట్నం: శుక్రవారం, అయ్యప్ప మాలదరణ భక్తులు శబరిమలై దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక బిక్ష ఏర్పాటు చేశారు ప్రముఖ వ్యాపారవేత్తలు తణుకు సోదరులు.
మండలం వంకాయగూడెం శివారులోని అయ్యప్ప దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో, తణుకు ఓంకారం, మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు తణుకు ప్రభాకర్ నేతృత్వంలో భక్తులకు భిక్ష మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ అర్చకులు సుమన్శాస్త్రి, అయ్యప్ప మాలదరణ గురు స్వాములు, వ్యాపారవేత్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు ఈ పవిత్ర యాత్ర ద్వారా ఆధ్యాత్మిక అనుభూతిని పొందగా, సమాజ సేవా భావనతో కూడిన కార్యక్రమం ఘనంగా ముగిసింది.
ఆముదాల పల్లి – గృహజ్యోతి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు
నేటి కరీంనగర్ శంకరపట్నం
శంకరపట్నం: గ్రామ సర్పంచ్ తాళ్లపల్లి మొగిలి శుక్రవారం గ్రామ ప్రజలకు ముఖ్య సూచనలు చేశారు. సర్పంచ్ మొగిలి అన్నారు, “ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఆర్థికంగా ఎదగవచ్చు అని చెప్పారు
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం ఆముదాల పల్లి గ్రామంలో గృహజ్యోతి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. “గృహజ్యోతి పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్తు అందజేయడం జరుగుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు గృహజ్యోతి పథకంలో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దొంగల రమేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ సతీష్, లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
కొత్త కొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్న జర్నలిస్ట్ సంఘనాయకులు
కరీంనగర్: శంకరపట్నం
కరీంనగర్ జిల్లా, శంకరపట్నం: వరంగల్ జిల్లా, బీ మదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో 2026 బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, శంకరపట్నం మండలం జర్నలిస్టు యూనియన్ నాయకులు శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ముందుకు మొక్కులు చెల్లించడంతో, కోరిన కోరికలు తీర్చబడ్డాయని అధ్యక్షులు జక్కోజు రమేష్ తెలిపారు.
“ప్రతి ఏటా మకర సంక్రాంతి సందర్భంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. భక్తులు స్వామివారి సన్నిధిలో వ్యక్తిగత కోరికలను కోరుకుంటారని రమేష్ తెలిపారు. ఆయురారోగ్యాలు, ఆస్తి, ఐశ్వర్యాలు ప్రసాదించాలని అభ్యర్థి ంచారు
ఈ పవిత్ర కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు దండు సమ్మయ్య, ఐజేయు కరీంనగర్ జిల్లా ఈసీ మెంబర్ గాజుల స్వామి, సీనియర్ జర్నలిస్ట్ మొలుగూరి వేణుగోపాల్ గౌడ్, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా, శంకరపట్నం: శనివారం తెల్లవారుజామున, మొలంగూర్ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు గొల్యాల గంగాధర స్వామి , ఆయన కుమారుడు కన్నయ్య ఆధ్వర్యంలో అగ్నిగుండాలు నిర్వహించబడ్డాయి.
ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరమూ మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించబడుతున్నాయి. భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అగ్నిగుండాలు, మరియు శ్రీ భద్రకాళి వీరభద్ర స్వామి కళ్యాణంలో పాల్గొని ఆశీర్వాదాలు పొందారు. ఈ వేడుకలో భక్తులు తమ కోరికలు స్వామివారి ముందు వ్యక్తం చేసి, కొంగు బంగారం వెలికి తమ ఇళ్లలో శాంతి, ఐశ్వర్యం ప్రసాదం పొందుతారు.
తెలంగాణ నలుమూలల నుండి, అలాగే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి భక్తులు హాజరై తమ ముక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుదరి రాజు, మాజీ సర్పంచులు దండు సాయిలు, మోరె అనూష శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం, అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు మరియు భక్తులు పాల్గొన్నారు.


