Shankarapatnam”కొత్తగట్టు జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కరీంనగర్, శంకరపట్నం |  

భక్తుల కోరిన కోరికలు తీర్చి, ఇళ్లలో కొంగు బంగారమై వెలిసే శ్రీ మత్స్య గిరింద్ర స్వామి 26వ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శనివారం ఆవిష్కరించారు.

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు గుట్టపై వెలసిన శ్రీ మత్స్య గిరింద్ర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కొత్తగట్టు జాతరగా ప్రసిద్ధి చెందిన శ్రీ మత్స్య గిరింద్ర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తుల విశేష పాల్గొనడంతో ఘనంగా నిర్వహించబడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోరెం రాజిరెడ్డి, ఆలయ కార్యనిర్వాహణాధికారి కె. సుధాకర్, ఆలయ అర్చకులు శేషం మురళీధర స్వామి, ధర్మకర్తలు తాడిచెర్ల, రామగిరి తిరుమల, ఎం. లక్ష్మణరావు, మీస రవీందర్, కె. రత్నం, ఎడ్ల తిరుపతి పాల్గొన్నారు.

అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బస్వాగౌడ్, హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ, శంకరపట్నం కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గొట్టె మధు, నాయకులు కీసర సంపత్ పవన్ కుమార్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 


 

జిల్లా ఆర్టీఏ మెంబర్‌ను కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

కరీంనగర్, శంకరపట్నం | 

కరీంనగర్ జిల్లా రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) సభ్యులుగా నియమితులైన పడాల రాహుల్‌ను శంకరపట్నం మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శంకరపట్నం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెపు అజయ్ ఆధ్వర్యంలో ఆర్టీఏ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పడాల రాహుల్‌కు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆడెపు అజయ్ మాట్లాడుతూ, ఆర్టీఏ సభ్యుడిగా పడాల రాహుల్ నియామకం జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గొర్ల ఆంజనేయులు, కార్యదర్శి గండికోట రవి, నాయకులు నూనె శ్రీకాంత్, కనకం మహేష్, చల్ల రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *