Shnakararpatnam” విద్యుత్ మోటార్ల చోరీ – శంకరపట్నం రైతుల ఫిర్యాదు

Shnakararpatnam”   శంకరపట్నం

కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, ఇప్పలపల్లె గ్రామ శివారులో చోటుచేసుకున్నది. రైతులు చింతి రెడ్డి, రాజిరెడ్డి, బోల్లెడ్ల కిషన్ రెడ్డి, ఎండి యాకూబ్ తమ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్‌కు బిగించి పెట్టిన విద్యుత్ మోటార్లు దొంగతనానికి గురయాయని తెలిపారు.

 పంట సాగులో సాగునీరు సక్రమంగా అందిస్తున్నట్లు కొద్ది రోజులుగా ఆ మోటార్లను ఉపయోగిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం మోటార్లను చూసి ఇంటికి వెళ్లి, బుధవారం ఉదయం తిరిగి కెనాల్ వద్దకు వచ్చారు. మోటార్లు అక్కడ లేవని గమనించిన రైతులు, గుర్తుతెలియని వ్యక్తులు మోటార్లను దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు.

ఈ మోటార్ల విలువ సుమారు 60,000 రూపాయల వరకు ఉందని బాధితులు పేర్కొన్నారు. వారు ఈ విషయాన్ని కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రైతులు చోరుకారులను పట్టుకోవాలని, మోటార్లను తిరిగి పొందాలని కోరుతున్నారు.

————————————————————————————————————-

శంకరపట్నం: 108 వాహన వైద్య సేవలు అభినందనీయం

జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ సూచన

కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గం, శంకరపట్నం మండలం కేంద్రంలో 108 వాహన వైద్య సేవలను జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలిస్తూ, సేవల సమర్థతను పరిశీలించారు.

సయ్యద్ ఇమ్రాన్ అన్నారు, “శంకరపట్నం మండలంలోని ప్రతి గ్రామంలో ప్రమాదాలు, అనుకోని ఘటనలు జరిగితే, 108 సేవలకు కాల్ చేయడం ద్వారా క్షణాల్లో వైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంటారు. మా తనిఖీలలో, 108 సిబ్బంది అనేక బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించి, అవసరమైతే హుజురాబాద్ పట్టణం లేదా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రవాణా చేస్తారని ధృవీకరించగలిగాం అని చెప్పారు.

జిల్లా మేనేజర్ ప్రజలను ఆకర్షిస్తూ చెప్పారు, “108 వాహన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, మనం ఆ సేవల సమర్థతను మరింత పెంచవచ్చు అన్నారు. వాహన సిబ్బందికి మానవత్వంతో, సోదర భావంతో అండగా నిలబడుతూ క్షతగాత్రులను రక్షించడంలో మనం భాగస్వాములు కావాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల 108 వాహన వైద్య సేవల ఈఎంపీ గూడూరి సతీష్ రెడ్డి, పైలెట్ ఖాజా ఖలీల్ ఉల్లా మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

———————————————————————————————————————

కరీంనగర్: విద్యార్థులకు ధృవీకరణ పత్రాల

సరఫరాలో అలసత్వం వద్దు – డిప్యూటీ తాసిల్దార్ ఖాదర్ సూచనలు

కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తాసిల్దార్ ఖాదర్ విద్యార్థుల కోసం ధృవీకరణ పత్రాల సరఫరా సమర్థతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

 విద్యార్థులు పై చదువులు, ఇతర ప్రభుత్వ సంక్షేమాల కోసం రెవెన్యూ శాఖ నుండి కులం, ఆదాయం, నివాసం వంటి ధృవీకరణ పత్రాలను పొందుతార‌ని,  ఆయా గ్రామాల గ్రామ పాలన అధికారులు అలసత్వం లేకుండా, మానవత్వంతో, సోదర భావంతో విద్యార్థులకు సహకరించాలల‌ని సూచించారు.. దరఖాస్తులను మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా తక్షణమే నమోదు చేసి ధృవపత్రాలు అందజేయాలి చెప్పారు.

అవసరమైతే, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా తనను సంప్రదించి వివరించవచ్చని, “క్షణాల్లో సమస్య పరిష్కరించి విద్యార్థులకు కావలసిన ధృవీకరణ పత్రాలను అందించడానికి కృషి చేస్తాం” అని చెప్పారు.

మండల పరిధిలోని అన్ని గ్రామాల మీసేవ నిర్వాహకులు, గ్రామ పాలన అధికారులు విద్యార్థుల ధృవీకరణ పత్రాలను తక్షణమే ఆన్లైన్ ద్వారా తాసిల్దార్ కార్యాలయంలో అందజేయాలని ఖాదర్ ఆదేశించారు. అలాగే, నిర్లక్ష్యం చేసిన అధికారులు షాఖా విధానానుసారంగా చర్యలకు లోనయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *