వరంగల్ లో ఘోరరోడ్డు ప్రమాదం

ఆటోను ఢికొట్టిన ఐదుగురు కూలీలు మృతి

వరంగల్ ప‌ట్ట‌ణం నుండి తొర్రూరు వైపు కూలీల‌తో వెళ్తున్న ఆటో వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లం ఇల్లంద‌కుంట గ్రామ స‌మీపానికి రాగానే ఎదురుగా వ‌స్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరితో పాటు అందులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఐదురుగు మృతి చెంద‌డంతో వారి కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం గురించి స‌మాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సవిూపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద బాధితులంతా కూలీలని గుర్తించారు. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి కారణంగా స్థానికులు ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *