రైతుబంధు, రైతు రుణమాఫీ తొందరగా అమలు చేయాలి

రైతుబంధు, రైతు రుణమాఫీ తొందరగా అమలు చేయాల‌ని సిరికొండ త‌హ‌సీల్దార్ కు శ‌నివారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పి నెలరోజులు గడుస్తున్నా అందరికీ రుణమాఫీ కాలేద‌న్నారు. రైతులందరీ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులలో పేర్లు ఉన్న వారి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నార‌ని ఇతర దేశాలలో తుకుతెరువు కోసం పోయిన వాళ్ల ప‌రిస్థితి గురించి ఆలోచించాల‌న్నారు. ఈ కార్యక్రమంలో భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య కారల్ మార్క్సు, నిమ్మల భూమేష్ మల్కి సంజీవ్ వి.పద్మ గులాం హుస్సేన్ శివరాజ్ ఉష అన్న కృష్ణ మాల రాములు గంగారాం లక్ష్మణ్ పిట్ల ఎల్లయ్య, కళ్యాణి, లక్ష్మి పెద్ద రాజా గౌడ్, నరస గౌడ్, చిన్న గంగాధర్, డి.రామా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవికూడా చ‌ద‌వండి

టీవీడిబెట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

రీల్స్ తెచ్చిన తిప్ప‌లు పోలీస్ అధికారి స‌స్పెన్ష‌న్

న‌న్ను క్షమిచండి కెనడా ప్రధాని ట్రూడో

నోటిఫికేష‌న్ అలో అనండి.. మా వార్త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *