డ్రైనేజిలో ప‌డి హెడ్ కానిస్టేబుల్ మృతి

విధినిర్వ‌హ‌ణ కోసం శ‌నివారం భ‌ద్రాచ‌లం వ‌చ్చిన హెడ్ కానిస్టేబుల్ కొద్దిసేప‌ట్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన ఆమె రామాల‌యం ద‌గ్గ‌ర‌లో ఉన్న డ్రైనేజీలో పడ‌డంతో ప్రాణాలు కోల్పోయింది. వివ‌రాల్లోకి వెళ్తే కొత్తగూడెం ప‌ట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి శ‌నివారం మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా బందోబ‌స్తు కోసం భ‌ద్ర‌చలం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో వాహ‌నాలు పార్కింగ్ చేసే ఏరియా నుంచి అన్న‌దానం స‌త్రం వైపు కాలిన‌డ‌న వెళ్తుండ‌గా ప్ర‌మాద‌వ‌శాత్తూ డ్రైనేజిలో ప‌డిపోయింది. గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెకు గాలించగా స‌మీపంలోని స్లోయిస్ గేట్ల వ‌ద్ద శ్రీ‌దేవి మృత దేహం ల‌భ్య‌మైంది. శ్రీ‌దేవి భ‌ర్త కూడా కానిస్టేబుల్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు .

ఇవికూడా చ‌ద‌వండి

న్యూయార్క్‌లో ఎమ‌ర్జెన్సీ 13 మంది మృతి

టీవీడిబెట్‌లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.

రీల్స్ తెచ్చిన తిప్ప‌లు పోలీస్ అధికారి స‌స్పెన్ష‌న్

9 వేల కోట్ల పొర‌పాటు.. బ్యాంకు సీఈవో రాజీనామా

నోటిఫికేష‌న్ అలో అనండి.. మా వార్త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ద‌వండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *