అయ్యో చిన్నారి… షాపింగ్ మాల్‌లో క‌రెంట్‌షాక్‌తో నాలుగేండ్ల చిన్నారి మృతి

అప్ప‌టి దాకా ముద్దు ముద్దు మాట‌ల‌తో అల్ల‌రి ప‌నులు చేస్తూ త‌మ కండ్ల ముందున్న ఆడ‌కుంటేప‌క‌ప క్ష‌ణిక‌కాలంలో ఆమె ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయి. త‌ల్లిదండ్రుల‌తో స‌ర‌దాగా షాపింగ్ మాల్ కెళ్లిన చిన్నారి ఆశ‌గా చాక్లెట్ తీసుకుందామ‌ని ఫ్రిడ్జ్ డోర్ తీసింది. అంతే క‌రెంట్ షాక్‌తో విల‌విలాడుతూ క‌న్నుమూసింది. త‌న తండ్రి ప‌క్క‌నే మ‌రో ఫ్రిడ్జ్‌నుంచి కావాల్సిన వ‌స్తువులు తీస్తూ ఉన్న‌ప్ప‌టికీ చిన్నారి గ‌మ‌నించ‌లేదు. కొద్దిసేప‌ట్లోనే చిన్నారిని గ‌మ‌నించి ఆపాప‌ను భుజాన వేసుకుని ఆస్ప‌త్రికి ప‌రుగు పెట్టినా ఆ పాప ప్రాణం ద‌క్క‌లేదు. వివ‌రాల్లోకి వెళ్తే.. న‌విపేట‌కు చెందిన రాజ‌శేఖ‌ర్ త‌న కూతురు రిషిత(4)తో క‌లిసి నందిపేట‌లోని ఓ షాపింగ్ మాల్‌కి వెళ్లాడు. అలా వెళ్లిన కొద్ద‌సేపటికే చిన్నారి ఫ్రిడ్జ్ త‌లుపు తీయ‌డానికి ప్ర‌య‌త్నించిన చిన్నారి క‌రెంట్ షాక్ మ‌ర‌ణించింది. కండ్ల ముందే క‌న్న బిడ్డ ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆ తండ్రి క‌న్నీటి ప‌ర్యంత‌మయ్యాడు.

 

చ‌ద‌వండి ఇవి కూడా

రేప్ చేసి… పొలంలో ప‌డేసి

తాయిత్తులు క‌ట్టిస్తాన‌ని.. క‌న్న‌తండ్రి ఎదుటే చంపేశాడు

లారీని ఢీకొట్టిన బ‌స్సు.. 15 మందికి తీవ్ర‌గాయాలు..

స‌బ్ స్ర‌యిబ్ నోటిఫికేష‌న్ అలో అనండి వివ‌ర‌ణాత్మ‌క క‌థ‌నాల‌ను ఎప్ప‌టికప్పుడు చ‌ద‌వండి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *