శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచం దూసుకెళ్తున్నది. అయినా మారమూల పల్లెల్లో ఇంకా మూడ నమ్మకాలు పెచ్చురిల్లతూనే ఉన్నాయి.. జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాగాలేకపోయిన దవాఖానాకు పోవాలే. కానీ మంత్రాలు, తంత్రాలతో బాగవుతుందనుకుంటే ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా బొక్కలగూడెంకు చెందిన దాసరి మధు (33) కు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. మళ్లీ మళ్లీ జ్వరం తిరగబెడుతుండడతో తాంత్రికుడిని కలిశారు. అతడు పూజలు చేయాలని సూచించాడు. దీంతో గోదావరి నది ఒడ్డున జ్వరంతో ఉన్న మధును క్షుద్రపూజలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో పూజలు చేస్తుండగా యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గోదావరి నది ఒడ్డున అంత్యక్రియలు నిర్వహిస్తండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడే పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పడుసు వయస్సు.. చెబితే వినరు.. అట్టిగా ప్రాణాలు పోతున్నయ్
తనకంటే ఉన్నతాధికారిణి అవుతుందేమోనని.. మహిళా కానిస్టేబుల్ చంపిండు. రెండేండ్లకు దొరికిండు