పెద్దపల్లి జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. మంథని పట్టణం ఎరుకల గూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియన దుండగులు అర్థరాత్రి మహిళలు గొంతు కోసి చంపారు. గుమ్మునూరు పంచాయతీ పరిధిలోని లక్ష్మిపూర్ రేషన్ డీలర్ బందెల రాజమణిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్‌బాడీని మార్చురికీ తరలించారు. రాజమణికి నలుగరు పిల్లలు, భర్త గతంలో చనిపోయాడు. వివాహేతరం సంబంధమే హత్యకు కారణమై ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లిలో మహిళ దారుణ హత్య
