ఒక‌టేనుక ఒక‌టి 150 వాహ‌నాలు ఢీ ఏడుగురు మృతి

రెండు మూడు వాహ‌నాలు ఢీకొట్ట‌డం చూశాం. కానీ ఇక్క‌డ ఏకంగా 150 వాహ‌నాలు ఢీ కొట్టుకున్నాయి. దీంతో ఏడుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో సోమ‌వారం చోటు చేసుకుంది. 150 పైగా వాహ‌నాలు ఢీకొట్ట‌డంతో మంట‌లు వ్యాపించాయి. దీనికి కార‌ణం పొగ‌మంచే అని అక్క‌డి అధికారులు భావిస్తున్నారు. పొగమంచు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ముందుగా ఏమున్నాయో తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల ఢీకొట్టుకున్నాయి. ఈ యాక్సిడెంట్ అంతా కేవలం అర‌గంట వ్య‌వ‌ధిలోనే చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప్ర‌మాదం లో ఏడుగురు మృతి చెందారు. 25 మందికి గాయ‌ల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ యాక్సిడెంట్ కార‌ణంగా 11 మైళ్ళ వ‌ర‌కు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఇవి కూడా చ‌ద‌వండి

ముందున్న‌ది మొసళ్ల పండగ అంటే ఇదేనేమో.. మొసలిని వదిలిన వైనంపై కెటిఆర్‌ ట్వీట్‌

పెగ్గు మీద పెగ్గులేసి… వేషాలు వేస్తే..ఎత్తిప‌డేసిన ఎద్దు..త‌గిన శాస్తి జ‌రిగిదంటున్న నెటిజ‌న్లు..

తమిళనాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *