స్కూల్ వ్యాన్‌, కాలేజీ బ‌స్సు ఢీ నలుగురు విద్యార్థులు మృతి 16 మందికి గాయాలు

స్కూల్ వ్యాన్‌, కాలేజీ బ‌స్సు ఢీ కొట్ట‌డంతో న‌లుగురు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బ‌దౌన్లో సోమ‌వారంచోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 16 మందికి గాయాలయ్యాయి. స‌త్య‌దేవ్ ఇంట‌ర్ కాలేజీ బ‌స్సు, మ‌యూన్ కు చెందిన ఎస్ ఆర్ పీఎస్ పాఠ‌శాల వ్యాన్ విద్యార్థుల‌ను తీసుకొచ్చేందుకు సోమ‌వారం పొద్దుగాల ఆయా ప్రాంతాల‌కు వెళ్లాయి. తిరిగి వ‌స్తున్న క్ర‌మంలో న‌విగంజ్ స‌మీపంలో ఒక‌దానికొక‌టి ఢీ కొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు విద్యార్థులు మృతి చెందారు. మ‌రో 16 మంది విద్యార్థులు గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డ్డ విద్యార్థుల‌ను స‌మీపంలోని ద‌వాఖానాకు త‌ర‌లించారు. ఘ‌ట‌నా స్థ‌లంలోనే స్కూల్ వ్యాన్ డ్రైవ‌ర్ ఒమేంద్ర మృతి చెందారు. విద్యార్థులు ఖుషి (6), హ‌ర్షిత్‌ (9), పారుల్ ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాద స‌మ‌యంలో పాఠ‌వాల వ్యాన్‌లో 20 మంది విద్యార్థులున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. 14 మంది మృతి.. కార‌ణం ఇదే

ట్రాక్ట‌ర్తో స్టంట్స్ చేయ‌బోతే… ప్రాణాలే పోయాయి..

భార్య‌ను చంపి.. రోడ్డు ప్ర‌మాదంగా న‌మ్మించి.. ప్రియురాలి భ‌ర్త‌ను చంపి.. సినిమాను త‌ల‌పించే స్టోరీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *